Site icon NTV Telugu

AP Govt: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడు రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు జారీ..

Apps

Apps

AP Government issues notification for jobs: ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. మూడు రకాల ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ లు జారీ చేసింది. దేవాదాయ శాఖలో ఈఓ, వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ అధికారి, భూగర్భజలాల శాఖలో జియో ఫిజిక్స్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. వ్యవసాయ అధికారులు 10 పోస్టులకు ఆగష్టు 19 నుంచి సెప్టెంబరు 8 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం కల్పించింది. ఎండోమెంట్ ఈఓలు 7 పోస్టులకు ఆగష్టు 13 నుంచీ సెప్టెంబరు 2 వరకు ఆన్ లైన్ దరఖాస్తులకు అవకాశం ఉంది. జియో ఫిజిక్స్ టెక్నికల్ అసిస్టెంట్‌ల 4 పోస్టులకు ఆగష్టు 13 నుంచి సెప్టెంబరు 2 వరకు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.

READ MORE: Vu Glo QLED TV: థియేటర్ ఫీలింగ్ గ్యారంటీ! సౌండ్, పిక్చర్, స్మార్ట్ ఫీచర్స్ అన్నీ మాక్స్ లెవెల్‌లో ఉండే కొత్త స్మార్ట్ టీవీలు..

Exit mobile version