NTV Telugu Site icon

Fact Check: ఏపీలో మద్యం అమ్మకాలు పెరిగాయా? నిజమెంత?

Wineshops

Wineshops

ఏపీలో జగన్ పాలనలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయని, మద్య నిషేధం మాటేమిటి అంటూ విపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. దీనికి సంబంధించి FACT CHECK విడుదల చేసింది ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు పెరిగిపోయాయంటూ కొన్ని పత్రికల్లో వస్తున్న కథనాలు అవాస్తవం. నిజానికి 2014–2019 మధ్యే రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. ప్రస్తుత ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు భారీగా తగ్గాయి. ఈ కింది టేబుళ్లే అందుకు నిదర్శనం అని పేర్కొంది.

Read Also:Touching Vehicles: ఓ వ్యక్తిపై 5 ఏళ్ల పాటు వాహనాలను తాకకుండా నిషేధం.. ఎందుకో తెలుసా?

ఈ ప్రభుత్వం దశలవారీగా మద్య నియంత్రణకు కట్టుబడి ఉంది. అందుకే షాక్‌ కొట్టేలా ధరలు పెంచింది. మద్యంపై అదనపు పన్ను విధించింది. ఫలితంగా గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో మద్యం విక్రయాలు సగటున 30 శాతం, బీరు విక్రయాలు సగటున 57 శాతం తగ్గాయని ప్రభుత్వం పేర్కొంది.

గత ప్రభుత్వంలో ఐఎంఎల్ (మద్యం) విక్రయాలు, బీరు విక్రయాలు ఎలా వున్నాయి. ప్రస్తుత ప్రభుత్వంలో ఐఎంఎల్ (మద్యం) విక్రయాలు, బీరు విక్రయాలు ఎలా వున్నాయో గణాంకాల రూపంలో వాస్తవాలను విడుదలచేసింది ప్రభుత్వం. అవేంటో చూద్దాం..

Read Also: Limca Book of Records : ఎంపీ సంతోష్‌ కుమార్‌కు లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు

Show comments