Good News: ప్రభుత్వ ఉపాధ్యాయులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. దీంతో ఉపాధ్యాయులంతా సంబరపడుతున్నారు. ప్రభుత్వ టీచర్ల బదిలీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకు సంబంధించి మార్గదర్శకాలను సోమవారం నాడు విడుదల చేసింది. గత వారంలో రాష్ట్ర ప్రభుత్వ బదిలీలపై ఏపీ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల బదిలీల విషయమై జగన్ ప్రభుత్వం వేర్వేరుగా మార్గదర్శకాలను విడుదల చేసింది.
Read Also:Train Reverse : స్టేషన్ మర్చిపోయిన లోకో ఫైలట్.. ట్రైన్ రివర్స్ తిప్పేశాడు
ఇందులో ఎనిమిదేళ్లు ఒకే చోట పనిచేసిన టీచర్లకు బదిలీలు తప్పనిసరి అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఐదేళ్లు ఒకే చోట పనిచేసిన హెడ్మాస్టర్ బదిలీ తప్పనిసరి అని జగన్ సర్కార్ పేర్కొ్ంది. కొత్త జిల్లాలు యూనిట్ గా టీచర్ల బదిలీలను నిర్వహించనుంది. ఈ నెల 31లోపుగా ఖాళీ అవుతున్న టీచర్ పోస్టులతోనే రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు చేపట్టనుంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీచర్ల బదిలీల కోసం జీవో నం.47ను విడుదల చేసింది. ఐదు రోజుల క్రితం ఉపాధ్యాయ సంఘాలతో ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. టీచర్ల ట్రాన్స్ఫర్లపై సమావేశం చర్చించారు. గతంలో కూడా ఇదే విషయమై ఉపాధ్యా సంఘాలతో మంత్రి బొత్స సత్యనారాయణ చర్చించారు.
Read Also:Salaar: ఎంత పని చేశారయ్యా.. ఇప్పుడు అప్డేట్స్ తెలిసేది ఎలా..?
