Pyyavula Keshav: ప్రతి అర్జీకి పరిష్కారం చూపించాల్సిందే అంటూ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు ఏపీ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని గుర్తుచేశారు. ప్రతి అర్జీపై కృషి చేయడం వల్లే ఎక్కువ పౌరుల నుంచి అర్జీలు రావడం జరుగుతున్నట్టు చెప్పారు. సమస్యలను విభజించి, క్యాటగిరీల వారీగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాము. గ్రీవెన్స్ వ్యవస్థను రొటీన్ ప్రక్రియగా కాకుండా, సమయస్పదంగా నిర్వహిస్తాం. ఇప్పటివరకు సుమారు 34,000 అర్జీలు పరిష్కరించాం. ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించే మెరుగైన వ్యవస్థను ప్రవేశపెట్టుతున్నాం.. రైతు సమస్యల విషయంలో మంత్రి కేశవ్ తెలిపారు.. మామిడి రైతుల నుంచి గిట్టుబాటు ధరలో కొనుగోలు చేశామని గుర్తుచేశారు మంత్రి పయ్యావుల.. బార్లీ, పొగాకు కొనుగోలు చేశామని.. ప్యాడీ కొనుగోలు కార్యక్రమం కొనసాగుతోందని వివరించారు.. తాజాగా మొక్కజొన్న సమస్యపై చర్యలు తీసుకుంటున్నాం.. అలాగే, అరటి కొనుగోలు మరియు మార్కెట్ అవకతవకలపై ప్రభుత్వం పర్యవేక్షణ చేస్తూ దృష్టి సారించిందని చెప్పారు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్..
Read Also: Bangladesh: భారత్ “ముక్కలైతేనే” బంగ్లాదేశ్‌కు శాంతి.. మాజీ ఆర్మీ అధికారి సంచలన వ్యాఖ్యలు..
