NTV Telugu Site icon

Ap elections: లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థుల జాబితా వెల్లడి

ఏపీలో ఎన్నికల జోరు కొనసాగుతోంది. ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. మరోవైపు నామినేషన్ల సరవరణ ప్రక్రియ కూడా ముగిసింది. ఈ నేఫథ్యంలో బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాలకు గాను 454 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా విశాఖ పార్లమెంటు నుంచి 33 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఈసీ తెలిపింది. అత్యల్పంగా రాజమండ్రి పార్లమెంటుకు 12 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు గాను 2387 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు ఈసీ వెల్లడించింది. అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి 46 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అత్యల్పంగా చోడవరం అసెంబ్లీ స్థానంలో కేవలం 6 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

లోక్ సభ అభ్యర్థుల జాబితా

 అసెంబ్లీ అభ్యర్థుల జాబితా