Site icon NTV Telugu

కేంద్రమంత్రికి సీఎం జగన్ లేఖ…ఆ భూమిని ఇవ్వండి…

మార్చి 10 వ తేదీన రాష్ట్రంలో మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి.  ఈ సమయంలో సీఎం వైఎస్ జగన్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాశారు.  విజయవాడలో రైల్వేకు సంబంధించి ఆక్రమిత భూ బదలాయింపుకు సంబంధించి వైఎస్ జగన్ కేంద్ర మంత్రికి లేఖ రాసారు.  విజయవాడలోని రాజరాజేశ్వరి పేటలో 800 కుటుంబాలు రైల్వే స్థలాన్ని ఆక్రమించి 30 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నాయి.  పేదలు ఆక్రమించిన భూమి క్రమబద్దీకరణకు దశాబ్దాల నుంచి విజ్ఞప్తి చేస్తున్న చర్యలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.  రైల్వే శాఖకు ఉపయోగంలో లేని ఈ భూమిని రాష్ట్రానికి బదిలీ చేయాలని సీఎం వైఎస్ జగన్ లేఖలో పేర్కొన్నారు.  దానికి బదులుగా అజీజ్ పేటలోని 25 ఎకరాల భూమిని రైల్వే శాఖకు బదిలీ చేస్తామని లేఖలో జగన్ పేర్కొన్నారు.  మరి ఈ లేఖపై కేంద్ర రైల్వేశాఖ ఎలా స్పందిస్తుందో చూడాలి.  

Exit mobile version