NTV Telugu Site icon

CM YS Jagan: న్యాయవాదులకు తోడుగా నిలిచాం.. ప్రభుత్వం తరఫునుంచి మేం కోరేది ఒక్కటే

Ys Jagan

Ys Jagan

YSR Law Nestham Scheme: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి జూనియర్‌ న్యాయవాదులకు వైఎస్సార్ లా నేస్తం ఆర్ధిక సహాయం అందించారు.. రాష్ట్రవ్యాప్తంగా 2,677 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులకు లబ్ధి చేకూర్చారు.. హామీ ఇచ్చిన ప్రకారం జూనియర్‌ న్యాయవాదులకు నెలకు రూ. 5,000 చొప్పున స్టైఫండ్ ఇస్తూ వస్తున్నారు.. ఫిబ్రవరి 2023 నుంచి జూన్ 2023 అంటే 5 నెలలకు సంబంధించిన స్టైఫండ్‌ను ఒక్కొక్కరికి రూ. 25,000 చొప్పున ఆర్ధిక సహాయం ఈరోజు విడుదల చేశరాఉ.. మొత్తం రూ. 6,12,65,000ను వర్చువల్‌గా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాలుగా లా నేస్తం అమలు చేస్తున్నాం.. 2,677 మంది అడ్వకేట్‌‌లకు రూ.6.12 కోట్లను వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం అని తెలిపారు..

Read Also: Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

లా కోర్సు పూర్తిచేసిన, మొదటి మూడు సంవత్సరాల్లో ప్రాక్టీసు పరంగా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉంది.. ఈ పరిస్థితుల్లో వారి కాళ్లమీద వాళ్లు నిలబడేందుకు, వారికి తోడుగా నిలుస్తూ ప్రతి నెలా రూ.5వేలు, ఏడాదిలో రూ.60వేలు ఇస్తున్నాం అని తెలిపారు సీఎం జగన్‌.. మూడేళ్లలో ఇలా ఒక్కొక్కరికీ రూ.1.8లక్షలు ఇస్తున్నాం.. దీని వల్ల వృత్తిలో వాళ్లు నిలదొక్కుకుంటారు.. జీవితంలో ముందుకు వెళ్తారన్న ఆయన.. మంచి ఆలోచనతో ఈ పథకం ప్రారంభించాం.. ఇప్పటి వరకూ 5,781 మందికి మేలు చేశాం.. మొత్తంగా 41.52కోట్లు జూనియర్‌ లాయర్లకు ఇచ్చాం అన్నారు.. ఇలాంటి పథకం, ఇలాంటి ఆలోచన దేశంలో ఏ రాష్ట్రంలో లేదు.. కేవలం మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతుందన్న ఆయన.. అడ్వకేట్లకు మంచి జరగాలనే ఉద్దేశంతో రూ.100 కోట్లతో ఇప్పటికే వెల్ఫేర్‌ ట్రస్టును పెట్టడం జరిగిందన్నారు.. మెడిక్లెయిం కానీ, ఇతరత్రా అవసరాలకు రుణాలు కావొచ్చు.. ఈ ఫండ్‌ నుంచి రూ.25 కోట్లు సహాయం చేయడం జరిగిందని వివరించారు. న్యాయవాదులకు రాష్ట్ర ప్రభుత్వం తోడుగా నిలిచింది.. ప్రభుత్వం తరఫునుంచి న్యాయవాదులను కోరేది ఒక్కటే.. జూనియర్లుగా ఉన్న న్యాయవాదులకు దీనివల్ల మంచి జరిగితే.. వీరు స్థిరపడ్డాక ఇదే మమకారం వీళ్లు పేదల పట్ల చూపిస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఒక అన్నగా, ఒక స్నేహితుడిగా వారి దగ్గరనుంచి ఆశిస్తున్నది ఇదే.. దీన్ని ఎప్పుడూ మరిచిపోవద్దని కోరారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.