NTV Telugu Site icon

Anupama Parameswaran: అబ్బా.. ఇలా చేస్తే ఎలా అనుపమా.. కుర్రాళ్లు ఏమైపోతారు..

Anupama

Anupama

అనుపమా పరమేశ్వరన్.. ఈ అమ్మడు గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు పడ్డాయి.. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తనలోని నటనను బయటపెడుతూ ఆకట్టుకుంటుంది.. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే ఈ అమ్మడు కు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువే.. ఫోటోషూట్, వీడియోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది.. తాజాగా బ్లూ చీరలో నెమలిలా అద్భుతమైన డ్యాన్స్ చేసింది అందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది..

ఇటీవల ఓనమ్ సెలబ్రేషన్ సమయంలో పాట పాడి ఆడియన్స్ ని ఫిదా చేసిన అనుపమ.. ఇప్పుడు డాన్స్ తో అక్కట్టుకుంటుంది. తాజాగా చీరకట్టుతో డాన్స్ వేసి వావ్ అనిపిస్తుంది.. ప్లేయిన్ బ్లూ శారీలో నడుము అందాలు చూపిస్తూ.. అనుపమ వేసిన సింపుల్ స్టెప్స్ ప్రతి ఒక్కర్ని మెస్మరైజ్ చేస్తున్నాయి. ఇక ఇందుకు సంబంధించిన వీడియోని అనుపమ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతుంది. వీడియోలో అనుపమ డాన్స్ కి లైక్స్ తో సమాధానం ఇస్తూ వస్తున్నారు..

ఇకపోతే సినిమాల విషయానికొస్తే.. అనుపమ ప్రస్తుతం ‘టిల్లు స్క్వేర్’ సినిమాలో నటిస్తుంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ఈ నెలలోనే రిలీజ్ అవ్వాల్సింది. కానీ సినిమాకి సంబంధించిన పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో పోస్ట్‌పోన్ చేసుకున్నారు. కొత్త డేట్ పై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ మూవీ పై ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఇక ఈ చిత్రంతో పాటు రవితేజ ‘ఈగిల్’ సినిమాలో కూడా అనుపమ నటిస్తుంది. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. అలాగే తమిళ్, మలయాళంలో కూడా ఒక్కో సినిమా చేస్తుంది.. ప్రస్తుతం అనుపమ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..