హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. అమ్మడు క్యూట్ నెస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజులో ఉంటుంది.. కాగా తాజాగా, సోషల్ మీడియాలో ఓ ఫోటోను పోస్టు చేసింది.. తాజాగా ఆమె వేకేషన్ కు వెళ్లిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది..
ఇటీవల కార్తికేయ 2 లో నటించింది.. ఆ సినిమా భారీ హిట్ ను అందుకోవడంతో అనుపమ మళ్లీ ఫాంలోకి వచ్చింది.. కార్తికేయ 2 అనంతరం విడుదలైన 18 పేజెస్ కమర్షియల్ గా ఆడలేదు. సుకుమార్ శిష్యుడు సూర్య ప్రతాప్ 18 పేజెస్ టైటిల్ తో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. థియేటర్స్ లో ఆడకున్నా ఓటీటీ లో బాగానే అలరించింది..బటర్ ఫ్లై టైటిల్ తో అనుపమ ఒక ఓటీటీ మూవీ చేశారు. అది కూడా నిరాశపరిచింది. ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగావుంది.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది..
తాజాగా మారిషస్ లో ఫుల్ గా ఎంజాయ్ చేసిన వీడియోని షేర్ చేసింది. ఈ వీడియోలో.. స్కై రోప్ డైవింగ్, గాల్లో రోప్ సహాయంతో సైకిల్ తొక్కడం, గాల్లో రోప్ సహాయంతో వెళ్లడం, కార్ రేస్, సెలయేళ్ళ వద్ద ఎంజాయ్ చేయడం, అడవుల్లో జంతువులతో, ప్రకృతిని ఆస్వాదిస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది.. ఆమె ఎంజాయ్ చేసిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. అవి క్షణాల్లో వైరల్ అయ్యింది.. అక్కడి నుంచి తిరిగి వచ్చాక టిల్లు స్క్వేర్ ప్రమోషన్స్ లో పాల్గొననుంది.
