NTV Telugu Site icon

Anupam Kher : రూ.500 నోట్లపై బాలీవుడ్ న‌టుడి ఫోటో.. స్పందించిన అనుపమ్ ఖేర్

New Project (32)

New Project (32)

Anupam Kher : మరోసారి న‌కిలీ క‌రెన్సీ క‌ల‌క‌లం రేపుతోంది. కొంద‌రు న‌కిలీ నోట్లను ముద్రించి మార్కెట్‌లో చ‌లామ‌ణీ చేస్తున్నారు. న‌కిలీ క‌రెన్సీ క‌ట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా వాటిని పూర్తి స్థాయిలో అడ్డుకోలేకపోతుంది. తాజాగా న‌కిలీ క‌రెన్సీ ముఠా గుట్టును ర‌ట్టు చేశారు అహ్మదాబాద్ పోలీసులు. అయితే.. ఈ నోట్లను చూసి అంద‌రూ ఆశ్చర్యపోతున్నారు. ఈ నోట్లపై గాంధీ చిత్రానికి బ‌దులుగా బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ ఫోటో ఉంది. నోట్లపై ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘రిసోల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ అని ముద్రించారు. నిందితులు ఈ నోట్లను ఉప‌యోగించి 2100 గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించడంతో అసలు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ప‌లువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి నుంచి రూ.1.60 కోట్ల విలువైన నకిలీ క‌రెన్సీని స్వాధీనం చేసుకున్నారు. న‌కిలీ క‌రెన్సీకి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. దీనిపై న‌టుడు అనుప‌మ్ ఖేర్ స్పందించారు. రూ.500 నోట్ల‌పై గాందీజీ ఫోటోకు బదులుగా నా ఫోటోనా అంటూ ఆశ్యర్యం వ్యక్తం చేశారు.ఏదైనా జరగొచ్చు అంటూ రాసుకొచ్చారు.

Read Also:Bigg Boss Telugu 8: బిగ్ బాస్ అదిరిపోయే ట్విస్ట్.. సోనియా ఎలిమినేట్.. బలి కానున్న మణికంఠ!

అనుపమ్ ఖేర్ దేశం గర్వించదగ్గ నటుల్లో ఆయనొకరు. ఆయన భాషలతో సంబంధం లేకుండా పలు సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. 69ఏళ్ల వయసులో ఆదివారం నాడు కూడా నటించే నిబద్ధత కలిగిన నటుడు. అనుపమ్ ఖేర్ తన కొత్త చిత్రం ‘ది సిగ్నేచర్’తో రాబోతున్నారు. ఇక లైలా మజ్ను, రాక్‌స్టార్, రెహనా హై తెరే దిల్ మే, వీర్-జారా, తుంబాద్ వంటి చిత్రాల రీ-రిలీజ్ తర్వాత, 2006లో దిబాకర్ బెనర్జీ దర్శకత్వం వహించిన హాస్య చిత్రం ఖోస్లా కా ఘోస్లా అక్టోబర్ 18న థియేటర్లలోకి రానుంది. ఖోస్లా కా ఘోస్లా సినిమాలో అనుపమ్ ఖేర్, బోమన్ ఇరానీ, పర్విన్ దబాస్, వినయ్ పాఠక్, రణవీర్ షోరే, తారా శర్మ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక అనుపమ్ ఖేర్ చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గానూ ఆయన ఫోటోను 500 రూపాయల నోట్లపై ముద్రించారు అంటూ కొన్ని కథనాలు వైరల్ అవుతూ ఉన్నాయి. “బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ పేరు మీద నోట్లను విడుదల చేసింది ప్రభుత్వం. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా గాంధీ స్థానంలో అనుపమ్ ఖేర్ ఫోటోతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లను విడుదల చేసింది.” అంటూ పోస్టులను వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నకిలీ నోట్ల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.

Read Also:Mohammed Siraj Catch: గాల్లో వెనక్కి డైవ్ చేస్తూ.. నెక్ట్స్ లెవెల్ క్యాచ్ పట్టిన సిరాజ్!