గుజరాత్‌లో మరో రైలు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం సూరత్ సమీపంలో అహ్మదాబాద్-ముంబై డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు కోచ్‌లు ట్రైన్ రన్నింగ్లో ఉండగానే ఊడిపోయాయి. కాగా.. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇటీవలి కాలంలో.. అనేక రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Congress: ప్రధాని ‘‘కమ్యూనిల్ సివిల్ కోడ్’’ వ్యాఖ్యలపై కాంగ్రెస్ విమర్శలు..
పశ్చిమ రైల్వే (డబ్ల్యూఆర్) విడుదల చేసిన ఒక ప్రకటనలో ఉదయం 8.50 గంటలకు రైలు (నంబర్ 12932) సియోన్, సూరత్ రైల్వే స్టేషన్‌ల మధ్య గోతంగం యార్డ్‌కు చేరుకోగానే ఈ సంఘటన జరిగిందని తెలిపింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊడిపోయిన కోచ్‌లను మళ్లీ రైలుకు అటాచ్ చేశారు.
Read Also: Periods Leaves: మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నెలలో ఒక రోజు పీరియడ్స్ సెలవులు
అలాగే.. ఈ ఘటన జరిగిన వెంటనే మరమ్మతు పనులు ప్రారంభించామని, లూప్ లైన్ ద్వారా రైళ్లను నడిపినట్లు పశ్చిమ రైల్వే సోషల్ మీడియా ‘ఎక్స్’లో తెలిపింది. ఈ మార్గంలో ఇతర రైళ్ల రాకపోకలపై ఎలాంటి ప్రభావం పడలేదని పశ్చిమ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వినీత్ అభిషేక్ తెలిపారు. కాగా.. మరమ్మతు పనులు పూర్తయ్యాయని, సబ్ మెయిన్ లైన్‌లో ఉదయం 11.22 గంటలకు ట్రాఫిక్‌ను పునరుద్ధరించినట్లు పశ్చిమ రైల్వే ప్రకటించింది.