NTV Telugu Site icon

NBK 109 : బాలయ్య మూవీలో మరో మలయాళ హీరో.. ఎవరంటే..?

Whatsapp Image 2024 03 13 At 1.14.50 Pm

Whatsapp Image 2024 03 13 At 1.14.50 Pm

నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా యంగ్ డైరెక్టర్ బాబీ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కిస్తున్నాడు.ఈ మూవీలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.దుల్కర్ సల్మాన్ ‘మహానటి’మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విషయం తెలిసిందే..దుల్కర్ సల్మాన్ తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నాడు.ఇప్పుడు నట సింహం బాలయ్య సినిమాలో కీలక పోషిస్తుందటంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి..ఇదిలా ఉంటే మరో మలయాళ హీరో మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ షైన్ టామ్ చాకో ను కూడా ఈ మూవీ కోసం సెలెక్ట్ చేశారని సమాచారం.ఆయనది విలన్ రోల్ అని టాక్ వినిపిస్తుంది..న్యాచురల్ స్టార్ నాని ‘దసరా’ సినిమాలో విలన్ గా నటించిన షైన్ టామ్ చాకో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు..దసరా మూవీ తర్వాత నాగశౌర్య ‘రంగబలి’ సినిమాలోనూ ఆయన విలన్ రోల్ చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ సినిమా తెలుగులో విలన్ గా ఆయనకు హ్యాట్రిక్ ఫిల్మ్ కాబోతుంది.

ఈ సినిమాలో సినిమాలో కీలక పాత్రలు చేస్తున్న స్టార్ ఆర్టిస్ట్స్ సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇంతకు ముందు ఈ సినిమాలో కీలక పాత్రకు బాలీవుడ్ హీరో బాబీ డియోల్ ఎంపికయ్యారు. ‘యానిమల్’ సినిమాతో ఆయనకు హిందీలో ఏ స్థాయి పాపులారిటీ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాబీ డియోల్ చేరికతో హిందీ ప్రేక్షకుల దృష్టి ఈ సినిమాపై పడింది. అలాగే తమిళ దర్శకుడు, నటుడిగా ఇటీవల వరుస సినిమాలు చేస్తున్న గౌతమ్ వాసుదేవ్ మీనన్ మరో కీలక పాత్ర చేస్తున్నారు.రీసెంట్ గా మహాశివరాత్రి సందర్బంగా NBK109 గ్లింప్స్ వీడియో రిలీజ్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.దీనితో బాలయ్య మూవీపై అంచనాలు భారీ స్థాయిలో వున్నాయి.. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ నిర్మాతలుగా వ్యవహారిస్తున్నారు.