Solar Eclipse: ఈరోజు ఫాల్గుణ మాస అమావాస్య సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఖగోళ శాస్త్రవేత్తల దృష్టిని ఒక విశేష ఖగోళ ఘటన కూడా అని పేర్కొంటున్నారు. ఈరోజు వలయాకార సూర్యగ్రహణం సంభవించనుందని వారు అంటున్నారు. శాస్త్రీయ భాషలో దీనిని “రింగ్ ఆఫ్ ఫైర్” అని పిలుస్తారు. ఈ గ్రహణంలో చంద్రుడు సూర్యుడి దాదాపు 96 శాతం భాగాన్ని కప్పివేస్తాడు.
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
భారత కాలమానం ప్రకారం ఈ సూర్యగ్రహణం మధ్యాహ్నం 3 గంటల 26 నిమిషాలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 5:10 నుంచి 6:15 గంటల మధ్య ఇది గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. రాత్రి 7 గంటల 58 నిమిషాలకు గ్రహణం ముగుస్తుంది. మొత్తం 4 గంటల 32 నిమిషాల పాటు ఈ గ్రహణం కొనసాగుతుంది. ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణం భారత్‌లో కనిపించదు. దక్షిణ ఆఫ్రికా ప్రాంతాలు, అంర్టార్కిటికా, దక్షిణ అమెరికా దేశాల్లో ఈ వలయాకార సూర్యగ్రహణం దర్శనమిస్తుంది. ముఖ్యంగా జింబాబ్వే, నమీబియా, జాంబియా, టాంజానియా, మౌరిషస్, బోట్స్వానా, మోజాంబిక్, చిలీ, అర్జెంటీనా వంటి దేశాల్లో స్పష్టంగా కనిపించనుంది.
ఇక ధర్మశాస్త్రాల ప్రకారం సూర్యగ్రహణం ప్రారంభానికి 12 గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది. అయితే గ్రహణం ప్రత్యక్షంగా కనిపించే ప్రాంతాల్లోనే సూతక కాలం అమల్లో ఉంటుంది. ఈ సూర్యగ్రహణం భారత్‌లో కనిపించకపోవడంతో ఇక్కడ సూతక కాలం వర్తించదు. ధర్మశాస్త్రాల ప్రకారం సూతక కాలాన్ని అశుభంగా భావిస్తారు. ఈ సమయంలో పూజా కార్యక్రమాలు, శుభ, మంగళకార్యాలు నిర్వహించరు.
