Site icon NTV Telugu

Andrapradesh : నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆర్టీసీలో ఉద్యోగాలు..

Apsrc

Apsrc

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ఇప్పటికే ఎన్నో సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. తాజాగా మరో సంస్థలో ఉన్న ఖాళీలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.. ఈసారి ఏకంగా ప్రభుత్వ సంస్థల్లో ఒకటైన ఆర్టీసీ తన శాఖలో ఉన్న పలు ఖాళీలకు దరఖాస్తుల ను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు డ్రేడుల్లో అప్రంటీస్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది..

ఈ క్రమంలో తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. విజయనగరం జోన్ పరిధిలోని తూర్పుగోదావరి, కాకినాడ, విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, మన్యం పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాలో ఈ ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి అభ్యర్థులు ఈ నెల 15 లోగా తమ దరఖాస్తులను అందించాల్సి ఉంటుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అర్హులైన అభ్యర్థులకు 18, 19, 21 తేదీల్లో విజయనగరంలోని ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది..

ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది.. ఈ ఉద్యోగాలకు అర్హతల విషయానికొస్తే.. సంబంధిత డ్రేడ్ లలో ఐటీఐ పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. విద్యార్హత ల్లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.. ఇంటర్వ్యూ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు https://www.apprenticeshipindia.gov. in/ వెబ్ సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది.. ఇక ఈ ఉద్యోగాల కు అప్లై చేసుకొనే వాళ్ళు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.. ఇది గమనించగలరు..

Exit mobile version