NTV Telugu Site icon

Rashmi Gautham: పెళ్లి చేసుకోబోతున్నయాంకర్ రష్మీ.. అబ్బాయి ఎవరంటే?

Rashmi Gautam

Rashmi Gautam

బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ పేరు తెలియని వాళ్లు ఉండరు.. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ వస్తుంది.. అంతేకాదు నిత్యం ఏదోక వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. రష్మీ బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది. ఇటీవల మళ్లీ గ్లామర్ డోస్ పెంచుతున్న రష్మీ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారు మతి పోగొడుతుంది.. తాజాగా ఈ అమ్మడు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది..

దాదాపు దశాబ్దం కాలం పాటు ఇండస్ట్రీలో రానిస్తూ అందరిని ఆకట్టుకుంటుంది.. తన డ్యాన్స్ లతో మాటలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది.. అందుకే ఈ అమ్మడుకు యూత్ ఫాలోయింగ్ ఎక్కువ.. ఈ అమ్మడు నటిగా కెరీర్ ను ప్రారంభించినా యాంకర్ గానే ఫేమ్ దక్కించుకుంది.. మరోవైపు హీరోయిన్ గా సినిమాల్లో కనిపిస్తూ అలరిస్తూ వస్తుంది.. ఇక సోషల్ మీడియాలోనూ రష్మీ గౌతమ్ నిత్యం యాక్టివ్ గా కనిపిస్తున్నారు..

జబర్దస్త్ షో ద్వారా బాగా ఫెమస్ అయిన ఈ అమ్మడు ఆ షోలో కమెడియన్ సుధీర్ తో ప్రేమాయణం నడిపిందనే వార్తలు ఒకప్పుడు బాగా వినిపించాయి.. ఆ తర్వాత వారిద్దరూ ఫ్రెండ్స్ అని క్లారిటి ఇచ్చేసారు.. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో మరోవార్త వినిపిస్తుంది.. అమెరికా అబ్బాయితే పెళ్లి ఫిక్స్ అయ్యిందనే వార్త వైరల్ అవుతుంది..రష్మీ అమెరికా అబ్బాయినే వివాహం చేసుకుంటుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. జాతకాలు చూపించారట.. త్వరలోనే పెళ్లి పై ప్రకటన వస్తుందని సమాచారం.. ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే కాస్త వెయిట్ చెయ్యాల్సిందే..