Anand Mahindra: సానియా మీర్జా నాకు స్ఫూర్తి: ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా కెరీర్ ఎన్నో ఒడిదొడుకుల మధ్య సాగింది. ఇటీవలే ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్ వరకు వెళ్లి ఓటమితో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర.. సానియా కెరీర్ తనకెంతో స్ఫూర్తి అని చెప్పారు. సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉండే ఆయన.. వారాన్ని ఉత్సాహంగా మొదలుపెట్టేందుకు ప్రతి సోమవారం స్ఫూర్తిదాయక సందేశాలను పంచుకుంటారు. ఈ రోజు కూడా ఆయన ఓ మండే మోటివేషన్ షేర్ చేశారు. మరి ఈరోజు ఆయన ప్రేరణ పొందింది ఎవరి నుంచో తెలుసా? మన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నుంచే. సానియా కెరీర్ తనలో కొత్త స్ఫూర్తిని రగిలించిందని మహీంద్రా నేడు ట్వీట్ చేశారు.
Also Read: Pre release: వెండితెర ‘ఐపీఎల్’కు రంగం సిద్థం!
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
టెన్నిస్ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించిన సానియా మీర్జా గత నెల తన చివరి గ్రాండ్‌స్లామ్ ఆడింది. ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీలో మిక్స్‌డ్ డబుల్స్‌లో ఫైనల్ వరకు వెళ్లి ఓటమితో గ్రాండ్‌స్లామ్ కెరీర్‌ను ముగించింది. ఆ మ్యాచ్‌కు ముందు సానియా మాట్లాడుతూ.. “పోటీతత్వం అనేది నా రక్తంలోనే ఉంది. నేను ఎప్పుడు కోర్టులో అడుగుపెట్టినా గెలవాలనే ఆడుతా. అది నా చివరి గ్రాండ్‌స్లామ్ అయినా లేదా చివరి సీజన్ అయినా సరే..!” అని తెలిపింది. ఈ సందేశాన్ని ఆనంద్ మహీంద్రా సోమవారం తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. “ఆమె(సానియా) తన కెరీర్‌ను ఎలా ప్రారంభించిందో అలాగే ముగించింది. విజయం సాధించాలనే పట్టుదల ఆమెలో ఏ మాత్రం తగ్గలేదు. నా కెరీర్‌లో ఈ దశలోనూ రాణించాలనే కోరికను నాలో సజీవంగా ఉంచుకునేలా ఆమె జీవితం గుర్తుచేసింది. ఆమే నా మండే మోటివేషన్” అని ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు.
She ended her playing career the way she started it: with her hunger to succeed undiminished. Reminds me to keep the desire to excel alive, even at this stage in my career. She’s my #MondayMotivation pic.twitter.com/6GnQYieBEe
— anand mahindra (@anandmahindra) February 6, 2023
36 ఏళ్ల సానియా మీర్జా ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తన కెరీర్‌లో సానియా మొత్తం 43 డబుల్స్ టైటిళ్లు సాధించింది. ఇందులో ఆరు గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలున్నాయి. మహిళల డబుల్స్ కేటగిరీలో 91 వారాల పాటు నంబర్ 1 క్రీడాకారిణిగా నిలిచింది. త్వరలో జరగబోయే దుబాయి ఓపెన్‌లో సానియా తన కెరీర్‌లో చివరి టోర్నీ ఆడనుంది.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!