NTV Telugu Site icon

Amma Rajasekhar : హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న అమ్మ రాజశేఖర్ తనయుడు..

Amma Rajasekhr

Amma Rajasekhr

Amma Rajasekhar : టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన స్టైల్ ఆఫ్ డాన్స్ మూమెంట్స్ తో అందరిని ఎంతగానో ఆకట్టుకున్న అమ్మరాజశేఖర్ కేవలం కొరియోగ్రాఫర్ గానే కాకుండా దర్శకుడిగా కూడా ఎంతగానో మెప్పించాడు.అమ్మ రాజశేఖర్ గోపీచంద్ హీరోగా నటించిన రణం సినిమాతో దర్శకుడుగా మారారు.ఆ సినిమా సూపర్ హిట్ అయింది.ఆ తరువాత రవితేజ తో ఖతర్నాక్ సినిమాను తెరకెక్కించగా ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.ఆ తరువాత అమ్మ రాజశేఖర్ యంగ్ హీరో నితిన్ తో టక్కరి సినిమా చేసాడు.ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.కానీ ఈ సినిమాలో హీరో నితిన్ తో దర్శకుడు అమ్మ రాజశేఖర్ అదిరిపోయే స్టెప్స్ వేయించాడు.

Read Also :Devara : పది ఊర్లకు కాపరిగా ఎన్టీఆర్.. ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్..

ఆ తరువాత తీసిన రణం 2 కూడా అంతగా ఆకట్టుకోలేదు.కెరీర్ లో కొంత గ్యాప్ తీసుకోని బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 పాల్గొన్న అమ్మ రాజశేఖర్ తనదైన ఆటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.ఇదిలా ఉంటే హైదరాబాదు పెద్దమ్మ తల్లి గుడిలో అమ్మ రాజశేఖర్ పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.. ఈ వేడుకల్లో ఆయన భార్య పిల్లలతో పాటు కొంతమంది స్నేహితులు కూడా పాల్గొని అమ్మ రాజశేఖర్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ సందర్భంగా అమ్మ రాజశేఖర్ ఒక ఆసక్తికరమైన అనౌన్స్మెంట్ చేసారు. అదేమంటే తన కొడుకు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు. తన దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలిపారు.ఆల్రెడీ షూటింగ్ కూడా పూర్తి అయిందని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నట్లు అమ్మ రాజశేఖర్ తెలిపారు.

Show comments