క్రికెటర్ గా అనూహ్యంగా రిటైర్ మెంట్ ప్రకటించాడు అంబటి రాయుడు. వరల్డ్ కప్ కు సెలెక్ట్ చేయకపోవడం పై తీవ్ర అసంతృప్తికి గురయిన రాయుడు రిటైర్ మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడేందుకు సిద్ధం అయ్యాడు.. కొంత కాలంగా అంబటి రాయుడు రాజకీయ ఎంట్రీ పైన పెద్ద చర్చ జరిగింది.దీనిపై ఇప్పుడు రాయుడు క్లారిటీ ఇచ్చారనీ తెలుస్తుంది.తాను త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని ఆయన ప్రకటించారు. ప్రజా సేవకు వెళ్లే ముందు జనం నాడి కచ్చితంగా తెలుసుకుంకుంటానని ఆయన వివరించారు. అందు కోసమే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు కూడా చేస్తున్నానని చెప్పారు.. గ్రామీణుల సమస్యలు అలాగే వారి అవసరాలు తెలుసుకొని వాటిలో ఏ పనులు నేను చేయగలను వారి ఏ అవసరాలు నేను తీర్చగలను అనే అంశాల పైన నిర్ణయానికి వచ్చిన తరువాత రాజకీయాల్లోకి అయితే వస్తానని ఆయన చెప్పారు. ముందుగా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు గ్రామాల్లో పర్యటనలు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
అంబటి రాయుడు వైసీపీలో చేరటం పక్కా అని ప్రచారం జోరుగా సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.. ఇప్పుడు అంబటి రాయుడు రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా స్పష్టం చేసారు.ఎక్కడో ఒక ఐటీ బిల్డింగ్ ను కడితే అదే అభివృద్ధి అవ్వదని పరోక్షంగా టీడీపీ చేసుకొనే ప్రచారానికి ఆయన కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ నిర్ణయాలకు మద్దతుగా ట్వీట్లు కూడా చేసారు.ఈ మధ్య కాలంలో పలు సందర్భాల్లో అంబటి రాయుడు సీఎం జగన్ ను కలిసిన విషయం తెలిసిందే.. ఐపీఎల్ ఫైనల్ లో చెన్నై గెలిచిన తరువాత జట్టు తన యాజమాన్యంతో కలిసి సీఎం జగన్ వద్దకు వచ్చారు.దీంతో అంబటి రాయుడు గుంటూరు లేదా మచిలీపట్నం ఎంపీగా బరిలో ఉంటారంటూ ప్రచారం జోరుగా సాగుతుంది.కానీ తాను సీఎం జగన్ తో రాజకీయ అంశాలు ఏవి చర్చించలేదని తాజాగా అంబటి రాయుడు స్పష్టం చేసినట్లు సమాచారం.తాను ప్రజలకు ఎలాంటి సేవ చేయగలనో నిర్ణయించుకున్న తరువాతనే రాజకీయంగా ఎంట్రీ ఇస్తానని ఆయన చెప్పుకొచ్చారు..