అల్లు అర్జున్ పుష్ప సినిమా తో పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకున్నాడు.తన తదుపరి సినిమాలను కూడా అంతకుమించి ఉండేలో ప్లాన్ చేసుకుంటున్నాడు.ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సెకండ్ పార్ట్ తో బిజీగా వున్నాడు అల్లుఅర్జున్. ఆ సినిమాతో వెయ్యి కోట్ల భారీ కలెక్షన్స్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ భారీగా అయ్యే అవకాశం ఉంది.ఈ సినిమా తర్వాత అల్లుఅర్జున్ తర్వాత నటించబోయే సినిమాలు కూడా పుష్ప సినిమాను అంతకుమించి ఉండేలా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం.
అల్లుఅర్జున్ అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ తో ఒక సినిమా చేయనన్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన ఇచ్చారు. ఆ ప్రాజెక్టును టీ సిరీస్ నిర్మించనుందనీ సమాచారం.అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేసేందుకు బన్నీ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.ఆ ప్రాజెక్టు పై అధికారికంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.అలాగే అల్లు అర్జున్ మరో యంగ్ డైరెక్టర్ తో కూడా సినిమా చేయబోతున్నట్లు సమాచారం.. నానికి దసరా వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించిన శ్రీకాంత్ ఓదెలా తో అల్లు అర్జున్ సినిమా చేసే అవకాశం ఉంది.దసరా సినిమాతో 100 కోట్ల దర్శకుడిగా గుర్తింపును అందుకున్నాడు శ్రీకాంత్.. ఇప్పుడు అతన్ని ఒక మంచి పాన్ ఇండియా కథను రెడీ చేసుకోమని అల్లుఅర్జున్ ఆఫర్స్ ఇచ్చినట్లు సమాచారం..ఇదివరకే ఒక కథపై కూడా వీరిద్దరి మధ్యలో చర్చలు జరిగాయని సమాచారం.. కానీ అల్లు అర్జున్ ఆ కథపై అంతగా ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. ఇక దర్శకుడు ప్రస్తుతం మరొక కథ పై ఫోకస్ పెట్టినట్లు సమాచారం.. పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ ను రెడీ చేసుకొని అల్లుఅర్జున్ తో మరోసారి చర్చలు జరిపే అవకాశం అయితే ఉంది. ఆ కథ అల్లుఅర్జున్ కు నచ్చితే వెంటనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం కూడా ఉంది
