NTV Telugu Site icon

Allu Arjun: మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డుపై అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటో తెలుసా?

Allu Arjun

Allu Arjun

రిపబ్లిక్ డే సందర్బంగా కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే.. దేశంలో వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలను అందించింది.. సినీ, రాజకీయా రంగాలతో పాటుగా అనేక రంగాల్లో తమ ఎనలేని సేవలను అందించిన ప్రముఖులు ఎందరో ఈ అవార్డులకు ఎంపిక అయ్యారు.. అందులో మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ రాజకీయ వేత్త మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఉన్నారు..

మెగాస్టార్ చిరంజీవికి సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. మెగా కోడలు ఉపాసన కూడా మామయ్యకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపింది.. రామ్ చరణ్ కూడా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.. తాజాగా మేనల్లుడు అల్లు అర్జున్ కూడా తన మామకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. పద్మ విభూషణ్ పురస్కారానికి ఈ ఏడాది చిరంజీవి పేరు ప్రకటించడంపై అల్లు అర్జున్ ఆనందం వ్యక్తం చేశారు..

అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మ విభూషణ్ అవార్డు కు ఎంపికైనందుకు మన మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు. కుటుంబం, అభిమానులతోపాటు యావత్ తెలుగు వారికి ఇది ఎంతో గర్వకారణం. ఈ విజయంపై సంతోషంగా ఉన్నాను. మేము గర్వపడేలా చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చాడు.. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..