NTV Telugu Site icon

Sudigadu 2: ‘సుడిగాడు 2’ కథ నేనే రాస్తున్నా: అల్లరి నరేష్

Allari Naresh

Allari Naresh

Allari Naresh on Sudigadu Sequel: అల్లరి నరేష్ నటించిన ‘సుడిగాడు’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్పూఫ్, కామెడీ సన్నివేశాలతో 2012లో వచ్చిన ఈ సినిమా.. అందరినీ ఆకట్టుకుంది. భీమినేని శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రచయితల్లో ఒకరిగా పనిచేశాడు. అప్పట్లో సుడిగాడు సినిమాను రూ.7 కోట్లు పెట్టి తీస్తే.. ఏకంగా రూ.32 కోట్లు వసూలు చేసింది. ఆ బ్లాక్ బస్టర్ సినిమాకు కొనసాగింపుగా సుడిగాడు 2 వస్తుందని హీరో అల్లరి నరేష్ చెప్పాడు.

అల్లరి నరేశ్‌ హీరోగా నూతన దర్శకుడు మల్లి అంకం తెరకెక్కించిన చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైల‌ర్ సోమవారం విడుద‌ల అయింది. ట్రైల‌ర్ విడుదల సందర్భంగా అల్ల‌రి న‌రేష్ మాట్లాడుతూ.. సుడిగాడు 2 వస్తుందని తెలిపాడు. ‘నా కెరీర్‌లో ఆల్ టైం బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన సుడిగాడు సినిమాకు సీక్వెల్ తీసుకొస్తాం. సుడిగాడు 2 కథ నేనే రాస్తున్నాను. ప్ర‌స్తుతం పార్ట్ 2కు సంబంధించి స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేస్తాం’ అని అల్ల‌రి న‌రేష్ తెలిపాడు. సుడిగాడు సీక్వెల్‌ వచ్చే ఏడాదిలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

Also Read: Aparna Das Marriage: గ్రాండ్‌గా యంగ్ హీరోయిన్ హల్దీ వేడుక.. ఫొటోస్ వైరల్!

ఆ ఒక్కటీ అడక్కు చిత్రంలో అల్లరి నరేశ్‌ సరసన ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తున్నారు. వెన్నెల కిశోర్‌, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుద‌ల చేయ‌గా.. మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంది. ఈ సినిమాను వేసవి కానుక‌గా మే 3న ప్రేక్ష‌కుల ముందుకు వస్తోంది.

Show comments