NTV Telugu Site icon

Game Changer: టాలీవుడ్ హిస్టరీలో ఫస్ట్ టైం.. గేమ్ ‘ఛేంజింగ్’ ఈవెంట్ కోసం రెడీ!

Game Changer Dallas

Game Changer Dallas

టాలీవుడ్ హిస్టరీలో ఒక గేమ్ చేంజింగ్ మూమెంట్ కి సర్వం సిద్ధమవుతోంది. అసలు విషయం ఏమిటంటే రామ్ చరణ్ తేజ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా తెరకెక్కింది. దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా నిర్మించారు. శిరీష్ మరో నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మునుపెన్నడూ లేని విధంగా అమెరికాలోని డల్లాస్ నగరంలో నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. డిసెంబర్ 21వ తేదీన ఈ ఈవెంట్ జరగబోతోంది. ఇప్పటి వరకు సాధారణంగా సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ అది కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రమే అమెరికాలో చేస్తూ వచ్చేవారు. కానీ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అమెరికాలో నిర్వహించడానికి ఇప్పుడు అంతా సిద్ధమైంది.

RGV: రామ్‌గోపాల్ వర్మకు ఫైబర్‌ నెట్ నోటీసులు

గేమ్ చేంజర్ అమెరికా డిస్ట్రిబ్యూటర్ రాజేష్ కల్లేపల్లి ఈ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేశారు. హీరో రామ్ చరణ్ తేజ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ లతో పాటు ఈ ఈవెంట్ హోస్ట్ చేయబోతున్న సుమ కూడా ఇప్పటికే డల్లాస్ చేరుకున్నారు. వారు మాత్రమే కాదు ఈ సినిమా దర్శకుడు శంకర్ తో పాటు రామ్ చరణ్ తేజ తర్వాత సినిమాలు చేయబోతున్న దర్శకులు బుచ్చిబాబు, సుకుమార్ కూడా ఈ ఈవెంట్ కి హాజరు కావడం కోసం డల్లాస్ చేరుకోవడం గమనార్హం. డల్లాస్ లో రామ్ చరణ్ అభిమానులు, తెలుగు సినీ అభిమానులు వీరికి బ్రహ్మరథం పడుతూ స్వాగతం పలికారు. ఈవెంట్ కి మరికొద్ది గంటల సమయం ఉండగా ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో కూడా గేమ్ చేంజర్ రామ్ చరణ్ హోరు కనిపిస్తోంది. ఇక సంక్రాంతి సంధర్భంగా ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

Show comments