All govt vehicles older than 15 yrs to be scrapped: 15 సంవత్సరాలు దాటిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వాహనాలు, రవాణా కార్పొరేషన్లు, భుత్వ రంగ సంస్థల యాజమాన్యంలోని బస్సులను వచ్చే ఏప్రిల్ 1 నుంచి తుక్కుగా పరిగణించనున్నారు. వాటి రిజిస్ట్రేషన్లు కూడా రద్దు చేయబడతాయని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశ రక్షణ, శాంతిభద్రతలు, అంతర్గత భద్రత నిర్వహణ కోసం కార్యాచరణ ప్రయోజనాల కోసం ఉపయోగించే ప్రత్యేక ప్రయోజన వాహనాలకు (సాయుధ, ఇతర ప్రత్యేక వాహనాలు) నియమం వర్తించదని నోటిఫికేషన్ పేర్కొంది.
ప్రాథమిక రిజిస్ట్రేషన్ నమోదయ్యి 15 సంవత్సరాలు పూర్తైన వాహనాలను వదిలించుకోవాలని.. వాటిని చట్టప్రకారం రిజిస్టరైన వాహన తుక్కు పరిశ్రమలకు తరలించాలని ఉత్తర్వుల్లో వెల్లడించింది. యూనియన్ బడ్జెట్ 2021-22లో ప్రకటించబడిన ఈ పాలసీ ప్రకారం వ్యక్తిగత వాహనాలకు 20 సంవత్సరాల తర్వాత ఫిట్‌నెస్ పరీక్షలు తప్పనిసరి. అయితే వాణిజ్య వాహనాలకు 15 సంవత్సరాల తర్వాత అవసరమవుతుంది. ఏప్రిల్ 1, 2022 నుండి అమల్లోకి వచ్చిన ఈ పాలసీ ప్రకారం.. పాత వాహనాలను రద్దు చేసిన తర్వాత కొనుగోలు చేసిన వాహనాలపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు రోడ్డు పన్నుపై 25 శాతం వరకు పన్ను రాయితీని అందిస్తాయని కేంద్రం తెలిపింది.
Read Also: Clean Yamuna: క్లీన్ యమునా.. రూ.1,028 కోట్ల గ్రాంట్‌కు ఢిల్లీ అసెంబ్లీ ఆమోదం
గత సంవత్సరం, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. ప్రతి సిటీ సెంటర్ నుంచి 150 కిలోమీటర్లలోపు కనీసం ఓ వాహన తుక్కు కేంద్రాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని, దేశం మొత్తం దక్షిణాసియా ప్రాంతంలో వాహనాల తుక్కుమార్పిడి కేంద్రంగా మారే అవకాశం ఉందని నొక్కి చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2021లో నేషనల్ వెహికల్ స్క్రాపేజ్ పాలసీని ప్రారంభించారు. ఇది పనికిరాని, కాలుష్యం కలిగించే వాహనాలను దశలవారీగా నిర్మూలించడానికి, వృత్తాకార ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తుందని చెప్పారు.