Site icon NTV Telugu

Vishwambhara: నేడే చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మూవీ టీజర్

Vishwambhara Teaser

Vishwambhara Teaser

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘విశ్వంభర’. బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో అత్యంత భారీ బడ్జెట్ లో యువీ క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి జోడీగా స్టార్ హీరోయిన్‌ త్రిష, ఆషిక రంగనాథ్ నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులు పూర్తయ్యాయి. ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నామని గతంలో ఎప్పుడో ప్రకటించారు మేకర్స్. అందుకు అనుగుణంగా షూటింగ్ పనులు చక చక చేస్తున్నారు. విశ్వంభర చిత్రాన్ని దాదాపు రూ.200 కోట్ల భారీ బ్జడెట్‌తో నిర్మిస్తున్నారు. ఎన్నో అంచనాలు నెలకొన్న చేసుకున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం షూటింగ్ అలాగే డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఇలా అన్నీ ఏకకాలంలో జరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమాపై ఇపుడు లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.

ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న టీజర్ ని ఈ దసరా పండుగ కానుకగా మేకర్స్ మెగాస్టార్ పై క్రేజీ పోస్టర్ తో కన్ఫర్మ్ చేయగా ఇప్పుడు.. ఈ ట్రీట్ కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత చిరు చేసిన ఫాంటసీ వండర్ ఇది కావడమే ఇందుకు కారణమని చెప్పాలి. దీనితో అందరి కళ్లు విశ్వంభర మీదే పడ్డాయి. మరి చూడాలి నేడు వచ్చే టీజర్ ఎలాంటి ట్రీట్ అందిస్తుందో.

Read Also:Skill University Admission: నేటి నుండి స్కిల్ యూనివర్సిటీ అడ్మిషన్లు ప్రారంభం…

Read Also:Jani Master Case: జానీ మాస్టర్‌ కేసులో ఊహించని ట్విస్ట్‌..! ఆమె నాపై లైంగికదాడి చేసిందంటూ యువకుడి ఫిర్యాదు..

Exit mobile version