NTV Telugu Site icon

Akhil Akkineni: హిట్ కొట్టాకే ఫాన్స్ ముందుకు అయ్యగారు!

Akhil Akkineni

Akhil Akkineni

Akhil Akkineni Public Appearence After a Hit Only: అక్కినేని నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన అఖిల్ ఇప్పటివరకు చెప్పుకోదగ్గ సినిమాలు చేసినవి వేళ్ళ మీదే ఉన్నాయి. నిజానికి అఖిల్ హీరోగా అఖిల్ అనే సినిమాతో హీరోగా లాంచ్ అయ్యాడు. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను లాంటి సినిమాలు కూడా పెద్దగా కలిసి రాలేదు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కాస్త పరవాలేదు అనిపించుకుంది. అయితే ఆ తర్వాత చేసిన ఏజెంట్ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో అఖిల్ తర్వాతి సినిమా ఏమిటి అని అందరిలోనూ అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం యు వి ప్రొడక్షన్స్ బ్యానర్ లో అనిల్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో అఖిల్ సినిమా చేస్తున్నాడు. కానీ అది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Koratala Siva: పక్కోడి పనిలో చెయ్యి.. హాట్ టాపిక్ అవుతున్న కొరటాల కామెంట్స్

తాజాగా అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా నాగార్జున సహా కుటుంబ సభ్యులందరూ ప్రత్యేక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అలా ఒక కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున అఖిల్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అభిమానులు అందరూ అక్కినేని అఖిల్ గురించి ప్రశ్నిస్తున్న సమయంలో అఖిల్ హిట్ కొడితే తప్ప అభిమానుల ముందుకు రానని అన్నాడంటూ కామెంట్ చేశారు. అయితే మీ అందరినీ అడగమని చెప్పినట్టుగా ఆయన పేర్కొనడం హాట్ టాపిక్ అవుతోంది. ఇక అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన సూపర్ హిట్ సినిమాలు కొన్నింటిని ఎంపిక చేసి వాటిని 4కే రిజల్యూషన్ లో రిలీజ్ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని కొన్ని సింగిల్ స్క్రీన్ ధియేటర్లలో వాటిని ఫ్రీగా ప్రదర్శించబోతున్నారు.

Show comments