Site icon NTV Telugu

Akhanda 2: కోర్టు ఉత్తర్వులు అంటే లెక్క లేదా? అఖండ 2 టికెట్ల అమ్మకాలపై హై కోర్టు సీరియస్

Akhanda 2

Akhanda 2

Akhanda 2: కోర్టు ఉత్తర్వులు అంటే లెక్క లేదా? అని అఖండ 2 టికెట్ల అమ్మకాలపై హై కోర్టు ప్రశ్నించింది. ఆదేశాలు ఇచ్చినా కూడా ఎందుకు టికెట్లను ఆన్లైన్లో విక్రయిస్తున్నారని బుక్ మై షోను కోర్టు నిలదీసింది. అఖండ–2 సినిమా టికెట్ ధరలను పెంచుకోవడానికి అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన మెమోను సస్పెండ్‌‌‌‌‌‌‌‌ చేస్తూ హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి గురువారం రాత్రి ప్రీమియర్ షో వేశారని, అధిక ధరకు టికెట్లను విక్రయించారని విజయ్ గోపాల్ అనే న్యాయవాది కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై మరోసారి హైకోర్టు సీరియస్ అయ్యింది. కోర్టు ఉత్తర్వులు అంటే లెక్కలేదా? అని ప్రశ్నించింది. తమకు ఉత్తర్వులు అందే లోపే ప్రేక్షకులు టిక్కెట్లు కొనుగోలు చేశారని బుక్‌మై షో తరఫు న్యాయవాది కోర్టులో పేర్కొన్నారు. ఇప్పుడు పెంచిన రేట్లతో టికెట్లను ఆన్లైన్లో విక్రయిస్తున్నారా? లేదా? అని కోర్టు అడిగింది. ఎందుకు మీ మీద కంటెంప్ట్ యాక్షన్ తీసుకోకూడదో చెప్పాలని హై కోర్టు అడిగింది. అనంతరం.. మధ్యాహ్నం మరోసారి విచారించనుంది.

READ MORE: Storyboard: సోషల్ మీడియా వెట్టింగ్ విధానంతో హెచ్-1బీ వీసాల జారీ వాయిదా..

Exit mobile version