Site icon NTV Telugu

Akhanda 2 : బాలయ్య సినిమాలో సల్మాన్ ఖాన్ కాపాడిన చిన్నారి!

Harshali

Harshali

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ ‘అఖండ 2: తాండవం’ కోసం నాల్గవ సారి కొలాబరేట్ అయ్యారు. ఈ హై-ఆక్టేన్ సీక్వెల్ కథ, స్కేల్, నిర్మాణం, సాంకేతిక నైపుణ్యం.. ప్రతి అంశంలో అఖండను మించి ఉంటుదని హామీ ఇస్తోంది. ప్రతిష్టాత్మకమైన 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు.

Also Read : Shirish Reddy: నేను మూర్ఖుడిని కాదు .. రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నాం!

మేకర్స్ ఈరోజు జననిగా హర్షాలీ మల్హోత్రా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. సల్మాన్ ఖాన్ బజరంగీ భాయిజాన్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించిన హర్షాలీ మల్హోత్రా అఖండ 2తో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ఆమె సాంప్రదాయ చీరలో అందమైన చిరునవ్వుతో అద్భుతంగా కనిపిస్తుంది. టీజర్‌కు నేషనల్ వైడ్ గా ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్‌లో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని అవతార్ లో కనిపించారు. టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆది పినిశెట్టి పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు.

Also Read : Dil Raju: దిల్ రాజు కాంపౌండ్ నుంచి రానున్న సినిమాలివే!

టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తోంది. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. సి రాంప్రసాద్ డీవోపీగా పని చేస్తున్నారు.తమ్మిరాజు ఎడిటర్. ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్. అఖండ 2 దసరా కానుకగా సెప్టెంబర్ 25న భారీ స్థాయిలో పాన్ ఇండియా రిలీజ్ కానుంది.

Exit mobile version