Site icon NTV Telugu

Aishwarya Rai: సత్యసాయి బోధనలు ప్రపంచానికి మార్గదర్శనం..

Aishwarya Rai

Aishwarya Rai

Aishwarya Rai: సత్యసాయి శతజయంతికి తనను ఆహ్వానించడం గౌరవంగా భావిస్తున్నానని నటి ఐశ్వర్య పేర్కొన్నారు.. సత్యసాయి బోధనలు ప్రపంచానికి మార్గదర్శనం చేశాయన్నారు.. సత్యసాయి ట్రస్ట్‌ ఎన్నో విద్యా సంస్థలు పెట్టి పేదలకు ఉచిత విద్య అందిస్తోందని కొనియాడారు. తాజాగా సత్యసాయి శతజయంతి ఉత్సవ కార్యక్రమంలో ఐశ్వర్యరాయ్‌ ప్రసంగించారు. ప్రజలకు సత్యసాయి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సత్యసాయి జన్మించి వందేళ్లు గడిచింది. ఆయన భౌతికంగా మనతో లేకపోయినా.. లక్షలాది మంది గుండెల్లో ఎప్పుడూ కొలువై ఉంటారు. బాబా నేర్పిన పాఠాలు అందరికీ ఆదర్శనీయమన్నారు. సత్యసాయి బాబా ఆచరించిన విధానాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయన్నారు. ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. “నిజమైన నాయకత్వం అంటే భగవంతుడికి, ప్రజలకు సేవ చేయడం” అని వివరించేవారని గుర్తు చేసుకున్నారు. సత్యసాయి ఛారిటీ చేస్తున్న సేవలను కొనియాడుతూ.. ఈ ఛారిటీ ద్వారా వేలాది మంది విద్యార్థులకు ఉచితంగా విద్య అందుతోందని తెలిపారు. సత్యసాయి ట్రాస్ట్ ద్వారా నెలకొన్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో వందలాది మంది పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయన్నారు.

READ MORE: Rajamouli : రాజమౌళి రాముడెవరు?

Exit mobile version