Site icon NTV Telugu

South Korea: తప్పిన ఘోర ప్రమాదం.. విమానంలో మంటలు.. ఆర్పేసిన ఫైర్ సిబ్బంది

Flite

Flite

దక్షిణ కొరియాలో విమాన ప్రమాదం తప్పింది. విమానాశ్రయం నుంచి బయలుదేరే ముందు విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై.. మంటలను ఆర్పేశారు. దీంతో ప్రయాణికులంతా క్షేమంగా బయటకు దించేశారు. ఒకరు స్వల్పంగా గాయపడ్డారు.

ఇది కూడా చదవండి: Allari Naresh: రీమేకులపై కన్నేసిన అల్లరి నరేష్?

దక్షిణ కొరియాలోని ఎయిర్ బుసాన్‌కి చెందిన విమానం గిమ్‌హే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్‌కు సిద్ధపడుతుండగా హఠాత్తుగా మంటలు చెలరేగాయి. విమానం తోక భాగం నుంచి మంటలు చెలరేగాయి. విమానంలో 169 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. మంటలు అంటుకోగానే విమానం మొత్తం ఖాళీ చేయించారు. అయితే ఒకరికి స్వల్ప గాయాలు అయినట్లు పేర్కొన్నారు. గాయపడ్డ వ్యక్తిని అస్పత్రికి తరలించినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. విమానం లోపల మంటలు చెలరేగాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. విమానం తోకలో ప్రారంభమైందని దక్షిణ కొరియాకు చెందిన యోన్‌హాప్ వార్తా సంస్థ తెలిపింది. ఇటీవల మువాన్ ఎయిర్‌పోర్టులో జెజు ఎయిర్ విమానం కూలిపోయి 179 మంది మరణించారు. ఇంతలోనే మరో విమానం సంభవించడం కలవరపెడుతోంది.

 

Exit mobile version