Site icon NTV Telugu

Imtiaz Jaleel: మాంసం దుకాణాల మూసివేతపై ‘బిర్యానీ పార్టీ’తో AIMIM నేత నిరసన!

Imtiaz Jaleel

Imtiaz Jaleel

Imtiaz Jaleel: ఛత్రపతి సంభాజీనగర్‌ (మహారాష్ట్ర)లో మాంసం దుకాణాలను పండుగల సందర్భంలో మూసివేయాలన్న స్థానిక మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఆదేశాలకు వ్యతిరేకంగా AIMIM నేత, మాజీ ఎంపీ ఇమ్తియాజ్ జలీల్‌ శుక్రవారం తన నివాసంలో ‘బిర్యానీ పార్టీ’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను ప్రశ్నించారు. మాంసం నిషేధంపై మునిసిపల్‌ కమిషనర్‌ ఆదేశాలను ఎందుకు ఉపసంహరించుకోలేదని ఆయన నిలదీశారు.

ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15), కృష్ణష్టామి సందర్బంగా చత్రపతి సంభాజీనగర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ వధశాలలు, మాంసం దుకాణాలు, మాంసం విక్రయించే హోటళ్లు మూసివేయాలని ఆదేశించింది. అయితే, ఈ సందర్బంగా జలీల్‌ మాట్లాడుతూ.. నేను చికెన్‌ బిర్యానీతో పాటు వెజిటేరియన్‌ వంటకం కూడా చేశాను. మునిసిపల్‌ కమిషనర్‌ వస్తే ఆయనకు వెజ్‌ ఫుడ్‌ ఇస్తాను. కానీ ప్రభుత్వం మనం ఏమి తినాలి? ఏమి తినకూడదు చెప్పే హక్కు లేదని? అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు మాంసం బ్యాన్ అమలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

Prabhas-JR NTR-Ram Charan : ప్రభాస్, రామ్ చరణ్‌, ఎన్టీఆర్.. బాలీవుడ్ డ్యామేజ్..

అలాగే ఈ విషయంపై ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌ ను ఉద్దేశిస్తూ.. సీఎం కమిషనర్‌ను ఆదేశించి మాంసం బ్యాన్ ఆదేశాలు ఉపసంహరించమని చెప్పి ఉంటే, విషయం అక్కడితో ముగిసేది. నిజానికి ‘తినవచ్చు’ అంటారు. కానీ, మార్కెట్లో అందుబాటులో ఉండదు. ఇలాంటి ఆదేశాలతో ప్రభుత్వం ఏం సాధించాలని చూస్తోంది? అని ప్రశ్నించారు. కృష్ణష్టామి కారణంగా మాంసం బ్యాన్ అమలు చేస్తున్నారని చెప్పడంపై జలీల్‌ స్పందిస్తూ.. ఈ పండుగ కొన్ని జిల్లాల్లో మాత్రమే జరుగుతోందా? రాష్ట్రవ్యాప్తంగా హిందువులు జరుపుకుంటున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ స్థాయి నిర్ణయం ఉంటే గౌరవించేవాళ్లం. కానీ కొందరు మునిసిపల్‌ కమిషనర్లు ప్రభుత్వం సంతోషం కోసం ఆదేశాలు ఇస్తున్నారు. ముస్లింలకు రంజాన్‌, బక్రీద్‌ మాత్రమే రెండు పండుగలు. ఈ రెండు రోజులు మద్యం దుకాణాలు మూసేస్తారా? అని ప్రశ్నించారు.

Drumstick Tree: మునగ చెట్టు ఇంటి ఆవరణలో ఉండవచ్చా? లేదా? ఉంటే ఏమవుతుంది?

ఛత్రపతి సంభాజీనగర్‌తో పాటు నాగ్‌పూర్‌, నాసిక్‌, మాలేగావ్‌ మునిసిపల్‌ కార్పొరేషన్లు కూడా మాంసం బ్యాన్ ఆదేశాలు జారీ చేయడంతో వ్యక్తిగత స్వేచ్ఛపై చర్చ మొదలైంది. ప్రతిపక్ష పార్టీలు ఈ నిర్ణయాన్ని విమర్శించగా బీజేపీ మాత్రం 1988లో శరద్ పవార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వాతంత్య్ర దినోత్సవం నాడు వధశాలలను మూసివేయాలన్న విధానం మొదలైందని గుర్తు చేసింది. మరోవైపు ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌ బుధవారం మాట్లాడుతూ ప్రజల ఆహారపు అలవాట్లలో జోక్యం చేసుకోవడం రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం కాదని, వధశాల మూసివేతపై సృష్టించిన వివాదం అవసరం లేని అంశమని తెలిపారు.

Exit mobile version