Site icon NTV Telugu

Rahul gandhi: మోడీ 3.0 సర్కార్‌‌పై రాహుల్ కీలక వ్యాఖ్యలు

Raehe

Raehe

ఎన్డీఏ కూటమిపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ కూటమి ఎప్పుడైనా కూలిపోవచ్చని జోస్యం చెప్పారు. ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఎన్డీఏ కూటమిలో చాలా అసంతృప్తి ఉందని తెలిపారు. ఇక ఎన్డీఏ కూటమిలోని కొందరు తమతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. ఎన్డీఏ బలహీనంగా ఉండటంతో ఏ చిన్న సమస్య అయినా ప్రభుత్వాన్ని కూల్చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ విద్వేషపు ఆలోచనను ప్రజలు తిరస్కరించారన్నారు. ఎన్నికల్లో లెవెల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌ ఉంటే ఇండియా కూటమి నిస్సందేహంగా మెజార్టీ దక్కించుకొని ఉండేదన్నారు. తమ చేతులు కట్టేసిన పరిస్థితుల్లోనూ తాము పోరాడామన్నారు. మోడీ 3.0 మనుగడ అయితే కష్టమేనని చెప్పారు. మున్ముందు కష్టాలను ఎదుర్కొంటుందని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Rohit Sharma: సూపర్ 8 మ్యాచ్లపై టీమిండియా కెప్టెన్ కీల‌క వ్యాఖ్య‌లు..

కచ్చితంతా మోడీ శిబిరంలో ఫిరాయింపులు జరిగే అవకాశం ఉందని రాహుల్ వ్యాఖ్యానించారు. కూటమిలో చిన్నపాటి అవాంతరాలు ఎదురైనా ప్రభుత్వం పడిపోతుందన్నారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ బలం పుంజుకుందని తెలిపారు. ఇండియా కూటమి 234 సీట్లు గెలుచుకుందని గుర్తుచేశారు. ఇక కాంగ్రెస్ సొంతంగా 99 స్థానాలు కైవసం చేసుకుందని చెప్పారు. ఇక బీజేపీ మ్యాజిక్ నెంబర్ దాటలేదని.. మిత్రపక్షాలతో మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. గత పదేళ్లుగా అయోధ్య గురించి మాట్లాడిన పార్టీ అయోధ్యలో తుడిచిపెట్టుకుపోయిందన్నారు.

ఇది కూడా చదవండి: Viral Video: అబ్బా ఏం ఐడియా బాసు.. ఇలా చేస్తే నెలల తరబడి కరివేపాకు ఫ్రెష్ గా..

Exit mobile version