NTV Telugu Site icon

Coromandel Express: ఒడిశాలో ఘోర ప్రమాదం తర్వాత మళ్లీ పట్టాలెక్కిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్..

Coramonal

Coramonal

Coromandel Express: ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాద ఘటన దేశవ్యాప్తంగా అందరినీ కలవరపరిచింది. మూడు రైళ్లు ఢీకొన్న దుర్ఘటనలో ఇప్పటివరకు 288 మంది ప్రాణాలు కోల్పోయారు. 1000కి పైగా మంది గాయపడ్డారు. ఇంకొందరి సమాచారం తెలియాల్సి ఉంది. ఏదేమైనాప్పటికీ ఈ ప్రమాద ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఒడిశాలో ట్రిపుల్ రైలు ప్రమాదంలో చిక్కుకున్న ప్యాసింజర్ రైళ్లలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఒకటి. తిరిగి కోరమాండల్ ఎక్స్ ప్రెస్ బుధవారం నుంచి తిరిగి సేవలను ప్రారంభించింది. మూడు రోజుల తర్వాత చెన్నై-షాలిమర్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలెక్కింది. పశ్చిమ బెంగాల్‌లోని షాలిమార్ నుండి చెన్నైకి మొదటి ప్రయాణాన్ని ప్రారంభించింది.

Read Also: Harish Rao: తెలంగాణ వేరే వాళ్ల చేతికి పోతే ఆగం అవుతుంది

ప్రమాదం తర్వాత రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. ఆ తర్వాత సిబ్బంది ట్రాక్‌ను పునరుద్ధరించి రైళ్ల రాకపోకలకు మార్గం సుగమం చేశారు. జూన్ 4న ధ్వంసమైన ట్రాక్‌లపై రైలు కదలిక, వాటిని మరమ్మతులు జరిగాయి. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో 51 గంటల పాటు పునరుద్ధరణ పనులు జరిగాయి. అనంతరం రైల్వే ట్రాక్ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించారు. ఇక రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో కోర‌మాండల్ ఎక్స్‌ప్రెస్‌ డ్రైవర్లు బతికే ఉన్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు డ్రైవ‌ర్లు భువ‌నేశ్వర్‌లోని ఏఎంఆర్ఐ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు. 36 ఏళ్ల అసిస్టెంట్ లోకో పైలెట్ హ‌జారి బెహిరా సాధారణ వార్డులో చికిత్స పొందుతుండగా, మ‌రో లోకో పైలెట్ డ్రైవ‌ర్ జీఎన్ మోహంతికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స అందిస్తున్నారు.

Read Also: Honda Elevate: హోండా ఎలివేట్.. హ్యుందాయ్ క్రేటా, కియా సెల్టోస్‌కు పోటీ.. బుకింగ్స్ ఎప్పటినుంచంటే..?