Site icon NTV Telugu

Actress Pratyusha Case: సాక్ష్యాలను తగలబెట్టేశారు.. హీరోయిన్ ప్రత్యూష తల్లి సంచలన కామెంట్స్

Actress Pratyusha Case

Actress Pratyusha Case

Actress Pratyusha Case: సంచలనం సృష్టించిన హీరోయిన్ ప్రత్యూష కేసులో దర్యాప్తు తీరుపై ఆమె తల్లి సరోజిని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసులో అత్యంత కీలకమైన సాక్ష్యాలను అధికారులే స్వయంగా ధ్వంసం చేశారని ఆమె ఆరోపించారు. మెడికో లీగల్ కేసుల్లో పాటించాల్సిన కనీస నిబంధనలను విస్మరించి, నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

READ ALSO: చిప్స్ తినడం మానకపోతే శరీరానికి జరిగే నష్టం ఇదే.!

ఘటన జరిగిన సమయంలో బాధితురాలి శరీరంపై ఉన్న దుస్తులు కేసులో అత్యంత కీలకమని, వాటిని ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపకుండా డస్ట్ బిన్‌లో వేసి తగలబెట్టడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని సరోజిని ఆవేదన వ్యక్తం చేశారు. “మెడికో లీగల్ నిబంధనల ప్రకారం బాధితురాలి దుస్తులను ప్యాక్ చేసి భద్రపరచాలి. కానీ ఇక్కడ సాక్ష్యాలు దొరకకుండా కాల్చివేశారు. దుస్తుల్లోనే అసలైన ఆధారాలు ఉంటాయి. ఇప్పుడు నాకు న్యాయం ఎలా జరుగుతుంది?” అని ఆమె ప్రశ్నించారు. ముఖ్యమైన ఎవిడెన్స్‌ను నాశనం చేసిన తర్వాత అసలు నిజాలు ఎలా బయటకు వస్తాయని అధికారులను నిలదీశారు. హత్య లేదా అత్యాచారం జరిగిందని నిరూపించడానికి కావాల్సిన ప్రాథమిక సాక్ష్యాలను మాయం చేసి, పోస్ట్‌మార్టం రిపోర్టులో ఏదో ఒక సాకును చూపి కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఈ విషయంలో తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.

READ ALSO: Viral Drum Guitar: ఎవరన్నా నువ్వు.. ఇంత టాలెంటడ్‌గా ఉన్నావ్! వైరల్ అవుతున్న మ్యూజిక్ వీడియో..

Exit mobile version