Site icon NTV Telugu

Manchu Vishnu-Meena: మంచు విష్ణు కీలక నిర్ణయం.. ప్రశంసించిన మీనా!

Meena

Meena

Actress Meena Hails MAA Decision YouTube Channels: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. హీరో, హీరోయిన్లను విమర్శిస్తూ చేసిన వీడియోలను, కామెంట్లను 48 గంటల్లోగా తొలగించాలంటూ డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్స్‌కు మంచు విష్ణు విజ్ఞప్తి చేశారు. అసత్య వార్తలను ప్రచారం చేస్తోన్న కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లను మా రద్దు చేసింది. మంచు విష్ణు తీసుకున్న ఈ నిర్ణయంపై సీనియర్ హీరోయిన్ మీనా ప్రశంసలు కురిపించారు. మంచు విష్ణు చాలా మంచి పనిచేశారని ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు.

‘అసత్య వార్తలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న యూట్యూబ్‌ ఛానళ్లపై యాక్షన్‌ తీసుకున్న మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌కు, అధ్యక్షుడు మంచు విష్ణుకు ధన్యవాదాలు. ఇండస్ట్రీ సమగ్రతను కాపాడటంలో మీరు చూపుతోన్న అంకితభావం అభినందనీయం. ఈ విషయంలో ఎందరో నటీనటులు ఎన్నో ఇంబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెగెటివ్‌ కామెంట్స్‌ను ఎదిరించడంలో, మన సంఘాన్ని కాపాడడంలో అందరం కలిసి ముందుకు వెళ్లాలి. మీ మద్దతు ఎప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాను. మంచు విష్ణు చాలా మంచి పని చేశారు’ అని మీనా పేర్కొన్నారు. మీనా వ్యక్తిగత విషయాలపై కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు ఇష్టానుసారంగా రాసుకొచ్చిన విషయం తెలిసిందే.

Also Read: 600KM Walk: 14 రోజుల పాటు 600 కిమీ నడిచి.. స్వగ్రామానికి చేరుకున్న వృద్ధుడు!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటులు, వారి కుటుంబాలను టార్గెట్ చేసి.. విమర్శలు, అసత్య వార్తలను కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్‌ పోస్ట్‌ చేశాయి. అలా చేసిన ఐదు యూట్యూబ్‌ ఛానల్స్‌ను మా ముందుగా రద్దు చేసింది. తాజాగా మరో 18 ఛానళ్లను రద్దు చేసింది. ట్రోలింగ్‌ వీడియోలను 48 గంటల్లోగా డిలీట్‌ చేయకపోతే తగిన చర్యలు తీసుకుంటామని మా హెచ్చరించింది.

 

 

Exit mobile version