NTV Telugu Site icon

Hero Havish: ‘భాగమతి’ దర్శకుడితో కలిసి హవీశ్ ‘ఎస్ బాస్’!

Actor Havish

Actor Havish

Hero Havish: ఏ స్టూడియోస్ బ్యానర్ పై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న సినిమా ‘ఎస్ బాస్’. హావిష్ హీరోగా నటిస్తున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్‌కు ‘భాగమతి’ ఫేమ్ అశోక్ దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో బ్రహ్మానందం ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ రచయిత ఆకుల శివ ఈ సినిమాకు కథ, మాటలు అందిస్తున్నారు. అశోక్ దర్శకత్వం వహించిన ‘భాగమతి’ సినిమా సూపర్ హిట్ కావడంతో దానిని హిందీలోనూ రీమేక్ చేసే ఛాన్స్ అతనికే లభించింది. ఆ సినిమా ‘దుర్గామతి’ పేరుతో పునర్నిర్మించారు.

Mega Power Star Ramcharan: ప‌దిహేనేళ్ల రామ్‌చ‌ర‌ణ్

ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకొని అశోక్ చేస్తున్న సినిమా ఇది. ఈ చిత్ర రెండో షెడ్యూల్ అక్టోబర్ మూడో వారం నుండి మొదలు కాబోతోంది. రవితేజ ‘ఖిలాడి’ సినిమా తరువాత కోనేరు సత్యనారాయణ నిర్మిస్తోన్న సినిమా ఇదే అవ్వడం విశేషం. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అలాగే ‘డీజే టిల్లు’ కెమెరామెన్ సాయి ప్రకాష్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ‘సెవన్’ మూవీ తర్వాత హవీష్‌ నటిస్తున్న ‘ఎస్ బాస్’ ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుంది.