NTV Telugu Site icon

ACB Joint Director: ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్.. ఏడు చోట్ల కొనసాగుతున్న సోదాలు

New Project (53)

New Project (53)

ఏసీపీ ఉమా మహేశ్వర్ రావు ను అరెస్ట్ చేసినట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధింద్ర వెల్లడించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఉమా మహేశ్వర్ రావు అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంకా ఏసీబీ బృందం ఏడు చోట్ల సోదాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నగదు, లాండ్ పత్రలు బంగారు వెండి ఆభరణాలు సీజ్ చేసామన్న విషయాలు తెలిపారు. ఏసీపీపై చాలా అభియోగాలు వచ్చాయని చెప్పారు. 17 ప్రపార్టీస్ గుర్తించామని.. 5 ఘాట్కేసర్ లో, 7 వైజాగ్ చోడవరం భూములు కొన్నారన్నారు. హైదరాబాద్ అశోక్ నగర్ 4 ఫ్లాట్ గుర్తించామన్నారు. శామీర్ పెట్ లో 1, కూకట్ పల్లి 1 మల్కాజీర్ 1 భూములు కొన్నారని తెలిపారు. సోదాల్లో రూ.37 లక్షలు, 60 తులాల బంగారం, రూ.3కోట్ల 40 లక్షలు విలువ చేసే ఆస్తులు సీజ్ చేశామన్నారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ చెప్పలేమని పేర్కొన్నారు. రెండు లాకర్లను గుర్తించినట్లు చెప్పారు. ఏసీపీ ఉమేశ్వరరావు ఆస్తులు రూ. 40 కోట్లుగా తేల్చామన్నారు. గవర్నమెంట్ విలువ ప్రకారం రూ. మూడు కోట్ల 40 లక్షల రూపాయల ఆస్తులను గుర్తించామన్నారు. తెలిపారు. శామీర్ పేట్ లో ఒక విల్లా ఉందన్నారు. రేపు ఉమా మహేశ్వర్ రావు ను కోర్టు లో ప్రవేశ పెడుతామన్నారు.

READ MORE: Phone Use: ఫోన్‌ ఎక్కువగా వాడుతుందని కూతురిని రాడ్తో కొట్టి చంపిన తల్లి

కాగా.. ఉమామహేశ్వరరావు గతంలో ఇబ్రహీం పట్నం ఏసీపీగా పనిచేశారు. ఈ సమయంలో అతనిపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. భూ వివాదాల్లో తలదూర్చి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్టు, సాహితీ ఇన్ఫ్రా కేసులో నిందితుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. నిందితులకు సపోర్ట్ చేసి బాదితులకు అన్యాయం చేశాడని పలువురు అన్నారు. సోదాల్లో భాగంగా పెద్ద మొత్తంలో నగదు, బంగారం, లాండ్ పత్రలు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. ముఖ్యంగా సాహితీ ఇన్ఫ్రా కేసులో బాధితుల దగ్గర నుంచే ఉమామహేశ్వరరావు డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం.