NTV Telugu Site icon

Bangalore: బెంగళూరు-తిరుపతి హైవేపై ప్రమాదం.. ముగ్గురు యువకుల మృతి

Accident

Accident

బెంగళూరు-తిరుపతి జాతీయ రహదారిపై ఘోర విషాదం చోటుచేసుకుంది. స్నేహితుడి పుట్టిన రోజు సందర్భంగా బర్త్‌డే కేక్ కొనేందుకు బయటకు వచ్చిన ముగ్గురు యువకుల్ని మినీలారీ రూపంలో మృత్యువు వెంటాడింది. అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు వదిలారు. దీంతో గ్రామంలో, కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇది కూడా చదవండి: Raveena: జర్నలిస్టుకు ఝలక్.. రవీనా టాండన్ 100 కోట్ల పరువు నష్టం దావా

ఓషన్‌ గ్రామానికి చెందిన పవన్‌, మంజు, చరణ్‌ అనే యువకులు స్నేహితుడి పుట్టినరోజు కేక్‌ కొనుగోలు చేసేందుకు కాణిపాకం వెళ్తుండగా చెర్లోపల్లి సమీపంలో ద్విచక్రవాహనాన్ని మినీ లారీ ఢీకొట్టింది. ఐషర్ వాహనం రాంగ్ రూట్‌లో రావడంతో ఈ ఘరో ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తోంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో పవన్‌, మంజు, చరణ్‌ అనే యువకులు ప్రాణాలు కోల్పోయారు.

ఇది కూడా చదవండి: Andhra Pradesh: ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతిపై చంద్రబాబు సర్కార్ ఫోకస్

సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల స్వగ్రామం బంగారుపాళెం మండలం ఓషన్‌ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

ఇది కూడా చదవండి: Nara Lokesh: విద్యాశాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష