Site icon NTV Telugu

Basara IIIT: నేటి నుంచి బాసర ట్రిపుల్ లో అడ్మిషన్స్ కోసం దరఖాస్తుల స్వీకరణ..

Basara Iiit

Basara Iiit

Basara IIIT: ప్రతిష్టాత్మకమైన బాసర ట్రిపుల్ ఐటీలో కొత్త విద్యాసంవత్సరానికి అడ్మిషన్లకు సంబంధించి వర్సిటీ అధికారులు ఆన్‌లైన్‌లో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. నేటి నుంచి బాసర ట్రిపుల్ ఐటీ అడ్మిషన్స్ కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. నేటి నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. www.rgukt.ac.in వెబ్‌సైట్, admissions@rgukt.ac.in ఇమెయిల్ ద్వారా సందర్శించాలని సూచించారు. ఇన్ చార్జి వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ మాట్లాడుతూ ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ కోర్సులో ఆసక్తి ఉన్న విద్యార్థులు టీజీ ఆన్‌లైన్, మీసేవ, యూనివర్సిటీ వెబ్‌సైట్ ద్వారా అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు ముగిసి ఫలితాలు వెలువడ్డాయి. ఉత్తమ జీపీఏ సాధించిన విద్యార్థులంతా కోర్సుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు.

Read also: Power Cuts: గమనిక.. నేడు హైదరాబాద్ లో పవర్ కట్..

తమ పిల్లలను ఏ కాలేజీలో చదివించాలి, ఏ కోర్సులు చదవాలి అనే విషయాలపై తల్లిదండ్రులు విద్యావేత్తల సలహాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా విద్యార్థుల చదువుపైనే ప్రత్యేక చర్చ నడుస్తోంది. తెలంగాణలో ఏకై క విద్యాలయ ప్రాంగణం కలిగిన బాసర ట్రిపుల్‌ఐటీ నోటిఫికేషన్‌ విడుదల కావడంతో ఇక్కడ దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడే చదివించాలని కోరుకుంటారు. కాగా.. బాసర ట్రిబుల్ ఐటీలో దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. 2020-21లో 32,000 మంది, 2021-22లో 20,178 మంది, 2022-23లో 31,432 మంది, 2023-24లో 32,635 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు.
Exit Polls: నేడు ఎగ్జిట్‌ పోల్స్‌.. 19 రోజులుగా అభ్యర్థుల్లో టెన్షన్‌

Exit mobile version