Site icon NTV Telugu

Sanjay Singh: తీహార్ జైలు నుంచి సంజయ్ సింగ్ విడుదల.. భారీగా స్వాగతం

Sa

Sa

తీహార్ జైలు నుంచి ఆప్ లీడర్, ఎంపీ సంజయ్ సింగ్ విడుదలయ్యారు. బుధవారం సాయంత్రం జైలు నుంచి బయటకు వచ్చారు. జైలు దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. మరోవైపు సంజయ్ సింగ్‌కు స్వాగతం పలికేందుకు జైలు దగ్గరకు పెద్ద ఎత్తున ఆప్ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. జైలు నుంచి బయటకు రాగానే సంజయ్ సింగ్ కార్యకర్తలకు అభివాదం చేశారు. అనంతరం నినాదాలు చేశారు.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో దాదాపు 6 నెలల పాటు సంజయ్ సింగ్ జైల్లో ఉన్నారు. అయితే మంగళవారం ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ట్రయిల్ కోర్టుకు కూడా బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన బుధవారం సాయంత్రం జైలు నుంచి బయటకు వచ్చారు. ఇదే కేసులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా ఇదే జైల్లో ఉన్నారు. ఆయనకు ఇంకా బెయిల్ లభించలేదు. ఇక లిక్కర్ కేసులో ఇటీవలే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా అరెస్టై తీహార్ జైల్లో ఉన్నారు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ హైకోర్టులో ఉంది. గురువారం తీర్పు రానుంది.

Exit mobile version