NTV Telugu Site icon

Viral Video: ఏంటి స్వామి అంత ధైర్యం.. వీడియో చూస్తే వణుకు ఖాయం..

Snakes

Snakes

Viral Video: సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో జంతువులకు సంబంధించిన వీడియోలు కొన్ని వైరల్ గా మారడం గమనిస్తూనే ఉన్నాం. అలాగే కొన్నిసార్లు పాములకు సంబంధించిన వీడియోలు కూడా గమనిస్తూనే ఉంటాం. ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో శరీరం వనికిపోయే ఓ వీడియో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో సంగతి ఒకసారి చూస్తే.. వీడియోలో ఓ వ్యక్తి భారి కొండచిలవను భుజాల మీద తీసుకుని వెళ్తుంటాడు. నలుపు రంగులో ఉన్న భారీ పైథాన్ చూడడానికే భయంకరంగా ఉన్న అతను చాలా కష్టపడుతూ ఆ కొండచిలువలను భుజాన వేసుకొని వెళ్తూ ఉంటాడు.

Carlos Alcaraz: సంచలనం.. రెండవ రౌండ్‌లోనే కార్లోస్ అల్కరాజ్‭కు ఎదురుదెబ్బ..

అలా కొద్ది దూరం ఆ భారీ కొండ చలువను మోసుకొని వెళ్లిన అతడు ఓ గదిలోకి ఎంటర్ అవుతాడు. ఆ గదిలోకి వెళ్లిన తర్వాత అక్కడ ఉన్న సన్నివేశాలను చూసి సోషల్ మీడియా వినియోగదారులు భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఇకపోతే ఆ గదిలో రకరకాల రంగులు ఉన్న కొండచిలువలు భారీ సంఖ్యలో ఉన్నాయి. నిజంగా వీడియో చూస్తేనే శరీరంలో వణుకు పుడుతుంది అంటే.. అక్కడికి వెళ్లి చూస్తే ఖచ్చితంగా గుండె పోటు రావడం ఖాయం. అలాంటిది కేర్ జే బ్రోవర్ మాత్రం ఆ కొండచిలువల మధ్య తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే., ఆ రూమ్ లో ఓ పసుపు రంగులో ఉన్న కొండచిలువను తీసుకోవడానికి వెళ్తుండగా ఆ కొండచిలువ ఒక్కసారిగా అతడిపై దాడి చేయగా అతని మోచేతికి గాయమైంది. ఇకపోతే కొండచిలువలు విషపూరితము కాదు కాబట్టి.. అతడు ప్రశాంతంగానే ఉన్నాడు. ఇక ఈ వైరల్ వీడియోను వీక్షించిన సోషల్ మీడియా వినియోగదారులు.. ఇంకొకసారి ఇలాంటి వీడియోలు చూడడానికి ధైర్యం చేయను అంటూ చాలామంది కామెంట్ చేస్తుండగా.. మరి కొందరేమో దయచేసి గుండెపోటు ఉన్నవాళ్లు ఈ వీడియోను కచ్చితంగా చూడవద్దు కామెంట్ చేస్తున్నారు.

Show comments