NTV Telugu Site icon

Viral Video: పార్శిల్ డెలివరీ చేస్తున్న రోబోట్.. ఇన్ఫ్లుయెన్సర్ వైరల్ రియాక్షన్..

Viral Video

Viral Video

ఒక రోబోట్ తన గదికి పార్శిల్ ను డెలివరీ చేయడాన్ని చూసి ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇన్ఫ్లుయెన్సర్ శ్రీధర్ మిశ్రా చాలా ఉత్సాహంగా ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్ అయింది. ఇటీవల ఒక కార్యక్రమానికి హాజరు కావడానికి చైనాలో పర్యటించినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. చైనాలో జరిగిన ఎస్డిఎల్జి ఈవెంట్లో రోబోట్ ద్వారా హోమ్ డెలివరీ అని ఇన్స్టాగ్రామ్లో వీడియోను పోస్ట్ చేస్తూ ఆయన రాశారు. వీడియోలో, తన పార్శిల్ ను డెలివరీ చేయడానికి ఒక రోబోట్ వచ్చిందని చెబుతూ.. మిశ్రా ఉత్సాహంగా తన గది నుండి బయటకు పరుగెత్తాడు.

Manam: మళ్ళీ మెస్మరైజ్ చేస్తోన్న మనం.. వైరల్ అవుతున్న వీడియోలు

ఆ తర్వాత ప్యాకేజీని ఇచ్చిన తర్వాత రోబోట్ తిరిగి వెళ్ళడానికి ప్రారంభించిన సమయంలో ఆయన దానిని అనుసరిస్తాడు. రోబోట్ లిఫ్ట్ లోకి ప్రవేశించడంతో వీడియో ముగుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ ఇప్పటికి క్లిప్ 4 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించించి. ఇక ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

Prashant Kishor: బీజేపీలోకి ప్రశాంత్ కిషోర్.. నిజం ఏంటంటే.?

నెటిజన్స్ లో కొందరు.. ఇది లిఫ్ట్లోని అంతస్తులను ఎలా ఎంచుకుంటుందని ఒక ఇన్స్టాగ్రామ్ యూజర్ అడగగా.. మరొకరు., మీరు వీడ్కోలు చెప్పలేదంటూ చమత్కరించారు. మరొకరైతే సోదర నిదానం అది కేవలం ఒక రోబోట్. అంత ఉత్సాహంగా ఉండకండి అంటూ కామెంట్ చేసారు.