Site icon NTV Telugu

Deepika Padukone : దీపికా పదుకొనే కు అరుదైన గౌరవం..

Deepikaaa

Deepikaaa

బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇటీవల ఈ అమ్మడు నటించిన అన్నీ సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి.. ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా ఆమెకు అరుదైన గౌరవం దక్కింది.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాతో పాటుగా మీడియాలో కూడా తెగ వినిపిస్తుంది.

ఈ అమ్మడు తాజాగా డెడ్ లైన్స్ గ్లోబల్ డిస్ రప్టర్స్ అనే హాలీవుడ్ మ్యాగజైన్ ప్రతి సంవత్సరం కూడా వినోదాత్మక రంగంలో రాణిస్తున్న ప్రముఖుల జాబితాను సైతం విడుదల చేస్తూ ఉంటుంది. అయితే ఈ ఏడాది మాత్రం బాలీవుడ్లో అగ్ర హీరోయిన్ గా పేరుపొందిన దీపికా పదుకొనేకు ఇక్కడ చోటు లభించింది.. ఇండియాలో ఆ గౌరవం పొందిన ఏకైక నటి ఈమె కావడం విశేషం.. ఈ విషయాన్ని స్వయంగా దీపికా తెలిపింది..

ఇక అంతేకాదు బాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్ లో కూడా తనని ఎంతోమంది ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారని తెలిపింది.. తన ఇది సంతోషకరమైన వార్త అని చెప్పింది.. ఇకపోతే 2018 లో ఈమె రణవీర్ సింగ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. ఇక సినిమాల విషయానికొస్తే.. బాలీవుడ్ లో పలు సినిమాలు చేస్తున్నారు.. ప్రభాస్‌తో ‘కల్కి’, హిందీలో ‘సింగమ్ రిటర్న్స్’ సినిమాల్లో చేస్తున్నారు.. మరో రెండు ప్రాజెక్టులలో నటిస్తుంది..

Exit mobile version