NTV Telugu Site icon

Viral Video : వార్నీ.. ఇదేం పిచ్చి రా అయ్యా.. క్షణాల్లో ప్రాణాలు పోయేవి..

Stunt

Stunt

ఏదైన కొత్తగా ట్రై చెయ్యాలని అనుకొనేవారు ఒక్కొక్కరు ఒక్కోలా ఆలోచిస్తారు.. ఎక్కువ మంది మాత్రం అడ్వంచర్ చేస్తున్నారు.. అందులో కొంతమంది సక్సెస్ అయితే మరికొంతమంది మాత్రం ప్రాణాలను వదులుతున్నారు.. అయిన కూడా విన్యాసాలు చెయ్యడం మానడం లేదు.. అలా ఓ వ్యక్తి కాస్త భిన్నంగా ఆలోచించాడు.. అతను చేసిన స్టంట్ అందరికి భయం కలిగించింది.. చివరికి సేఫ్ గా ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు..

కొందరు వ్యక్తులు రోడ్లపై బైక్ విన్యాసాలు చేస్తే.. మరికొందరు సన్నని తాడుపై నడుస్తూ స్టంట్స్ చేస్తుంటారు. ఇంకొందరు విన్యాసాలు చేయడానికి ఎత్తైన కొండలను ఎంచుకుంటారు. కొండపై నుంచి దూకేస్తారు. వాస్తవానికి ఇది చాలా ప్రమాదకరం, ఇందులో చిన్నపాటి పొరపాటు జరిగినా కూడా ప్రాణాలుు గాల్లో కలవాల్సిందే. ఇలాంటి విన్యాసాలు చేయడంలో అనుభవం ఉన్నవారే చేస్తారు. తాజాగా అలాంటి ఒక స్టంట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వెళ్లి.. ఓ ఎత్తైన కొండపై నుండి దూకుతాడు. అయితే, కొంత సమయం వరకు అతని పారాచూట్ తెరుచుకోలేదు. చివరి క్షణంలో అతని పారాచూట్ తెరుచుకుంది. దాంతో అతను సేఫ్‌గా బయటపడ్డాడు. అయితే, అతని స్టంట్‌ను గుర్తించని జనాలు.. మొదట షాక్ అయ్యారు. అతను పరుగెత్తుకుంటూ కొండపై నుంచి లోయలోకి దూకడంతో షాకైన చుట్టు పక్కన జనాలు.. పెద్ద పెద్దగా కేకలు వేశారు. అతన్ని వారించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ.. అవేవీ వినకుండా ఆ వ్యక్తి నేరుగా కొండపై నుంచి దూకేశాడు. అయితే, తన బ్యాలెన్స్ సరిగా లేకపోవడంతో.. వెంటనే పారాచూట్ తెరిచాడు.. అది వెంటనే తెరచుకోలేదు.. కాస్త టైం తీసుకొని ఓపెన్ అయ్యింది.. దీంతో అతను సేఫ్ గా దిగాడు.. ఈ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు కామెంట్స్ తో మరింత వైరల్ చేశారు..