మీడియాపై దాడి ఘటనలో మోహన్ బాబు మీద కేసు నమోదు చేశారు. మోహన్ బాబుపై 118 బీఎన్‌ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మరోవైపు మోహన్‌బాబు ఆరోగ్యంపై వైద్యుల ప్రకటన వెలువడింది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రాత్రి బీపీ పెరగడంతో పాటు.. కంటి కింద, కాలికి చిన్న చిన్న గాయాలు అయినట్లు చెప్పారు. ప్రస్తుతం జనరల్ వార్డులో చికిత్స పొందుతున్నారు.. ప్రస్తుతం కార్డియోలజీ, జనరల్ ఫిజీసియన్ పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఆస్పత్రి యాజమాన్యం అనుమతి తరువాత మోహన్ బాబు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని వైద్యులు వెల్లడించారు. అయితే ఇవ్వాళ రాచకొండ సీపీ యెదుట హాజరుకావాల్సి ఉండగా… మోహన్ బాబు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు..హెల్త్ బులిటెన్ అనంతరం మోహన్ బాబు సీపీ ముందు హాజరు అవుతారా? లేదా? అనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
READ MORE: Manchu Manoj : మీడియా మిత్రులకు క్షమాపణలు.. కన్నీళ్లు పెట్టుకున్న మంచు మనోజ్
ఇదిలా ఉండగా.. తాజాగా మంచు మనోజ్ ప్రెస్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా మిత్రులకు క్షమాపణలు చెప్పారు.. మీడియాపై దాడి చేయడం బాధ కలిగించిందన్నారు. “నా భార్య, ఏడు నెలల కూతురి పేరు లాగుతున్నారు.. నేను నా సొంత కాళ్ల మీద నిలబడుతున్నాను.. నేను ఎవరిని ఆస్తి అడగలేదు.. సాయంత్రం 5 గంటలకు ప్రెస్‌మీట్ పెట్టి అన్ని వివరాలను వెల్లడిస్తాను. ఇలాంటి రోజు వస్తోందని నేనెప్పుడూ ఊహించలేదు. నా భార్య ఏడు నెలల గర్భిణీగా ఉన్న సమయంలో బాధలు అనుభవించింది.” అని భావోద్వేగానికి గురయ్యారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను గుర్తు చేసుకుంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. తన బంధువులపై దాడి చేశారని ఆయన తన కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేశారు. ఇన్నాళ్లు ఆగాను.. ఇక ఆగలేనని ఆయన చెప్పారు. తనపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. అన్ని విషయాలు సాయంత్రం చెబుతానని ఆయన మీడియాకు తెలిపారు. తండ్రి తనుకు దేవుడని.. ఇలా ఉండేవాడు కాదన్నారు.