NTV Telugu Site icon

Boy Missig: ఈ నగరానికి ఏమైంది? నిన్న ఇందు.. నేడు నసీర్ మిస్సింగ్

Old City

Old City

Boy Missig: చిన్నారులను మిస్సింగ్‌ భాగ్యనగరంలో కలకలం రేపుతుంది. రెండురోజుల ముందు 9వ తరగతి చదువుతున్న బాలిక ఇందుకు మిస్సింగ్‌ కేసులో సస్పెన్స్ ఇంకా వీడకముందే బాలుడు మిస్సింగ్‌ సంచలనంగా మారిన విషయం తెలిసిందే.. ఇవాల పాతబస్తీలో బాలుడు అదృశ్యం చర్చకు దారితస్తోంది. దీంతో ఈ నగరానికి ఏమైందని నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. చిన్నారులపై ఎవరైనా టార్గెట్‌ చేసి ఇలా దారుణాలకు పాల్పడుతున్నారా? నిన్న చిన్నారి మిస్సింగ్‌ కేసు ఛేదిస్తున్న పోలీసులకు చిన్నారి ఇందు చెరువులో విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రలు ఆర్తనాదాలు మిన్నంటాయి. పోలీసులే దీనికి కారణమంటూ పోలీసుల వాహనాలపై దాడులు చేశారు కుటుంబసభ్యులు. అయితే ఇంకా ఇందుకేసు మిస్టరీగానే ఉన్న, ఉద్రికత్తల నడుమ ఇవాళ ఇందు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.అయితే ఈనేపథ్యంలో పాతబస్తీలో బాలుడు నసిర్‌ కేసు పోలీసులకు ఛాలెంజ్‌ గా మారింది. ఇందు మృతి కేసు మిస్టరీని ఛేదిస్తున్న పోలీసులకు పాత బస్సులో 13 ఏళ్ల బాలుడు నసిర్‌ అదృశ్యం కేసు పోలీసులకు సవాల్‌ గా మారింది.

read also: Man Wakes Up From Dead: నోట్లో పాలు పోశారు.. శవం లేచి కూర్చుంది

పాతబస్తీలోని హుస్సేనీ ఆలం ఫతే దర్వాజాలో నివాసముండే మహమ్మద్ నసీర్ (13) ఈనెల 14 నుండి కనిపించకుండా పోయాడు. సాయంత్రం కూరగాయల కోసం వెళుతున్నాని ఇంట్లో చెప్పి బయటికి వెళ్లాడు నసిర్‌. కానీ రాత్రి వరకు తిరిగి రాలేదు. చుట్టుపక్క ప్రాంతాలలో బంధువుల వద్ద వాకబు చేసినా బాలుడి ఆచూకీ లభించలేదు. దీంతో తల్లిదండ్రులు హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాలుడిని బీహార్ కు చెందిన యువకుడు తీసుకెళ్లాలని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బీహార్ చెందిన యూసఫ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆచూకీ తెలిసినవారు పోలీస్ స్టేషన్ లేదా కంట్రోల్ రూమ్ లో సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. అయితే డిసెంబర్‌ 14న బాలుడు నసిర్‌ మిస్సింగ్‌, 15న చిన్నారి ఇందు మిస్సింగ్‌ కేసులో అనూహ్యపరిణామాలు చోటుచేసుకున్నాయి. చిన్నరి డెడ్‌ బాడీ దొరకడంతో అసలేం జరిగింది అనే కోణంలో విచారణ చేపట్టిన పోలీసులకు బాలుడు నసిర్‌ కేసుపై కూడా ఫోకస్‌ పెట్టారు. అయితే నసిర్ తల్లి గౌసియా బేగం తన కొడుకును తనవద్దకు తీసుకురావాలని కోరుతున్నారు.
ChandraBabu: గుంటూరు డీఐజీకి చంద్రబాబు ఫోన్.. మాచర్ల పోలీసులపై చర్యలకు డిమాండ్