7.3 kgs Baby: సాధారణంగా నవజాత శిశువుల బరువు సగటున మగపిల్లాడు అయితే 3.3 కేజీలు, ఆడపిల్ల అయితే 3.2 కేజీలు ఉంటుంది. బ్రెజిల్‌కు చెందిన ఓ మహిళ ఇటీవల 7.3 కేజీల బరువు ఉన్న బిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువు రెండు అడుగుల పొడవు కూడా ఉన్నది. అమెజొనాస్ స్టేట్‌లో ఈ అరుదైన ఘటన జరిగింది. క్లీడియాన్ శాంటోస్ అనే మహిళకు వైద్యులు సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు. అధిక బరువుతో జన్మించిన ఈ శిశువు, తల్లీ ఇద్దరు ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు వెల్లడించారు.
Read Also: Hyderabad Blast Case: భాగ్యనగర్‌లో పేలుళ్ల కుట్ర కేసు.. ఇప్పుడు వారిచేతిలో..
ఆ బిడ్డకు యాంగర్‌సన్ శాంటోస్ అని పేరు పెట్టారు. 1955లో ఇటలీలో ఒక బిడ్డ 10.2 కేజీలతో పుట్టింది. ఇప్పటి వరకు అత్యంత బరువైన శిశు జననాల్లో అదే రికార్డు. అంతకన్నా చాలా ఎక్కువ బరువుతో పుట్టే భారీ శిశువులను మాక్రోసోమియా (గ్రీకు భాషలో పెద్ద శరీరం అని అర్థం) అని పిలుస్తారు. 4 కేజీల కంటే ఎక్కువ బరువుతో పుట్టే ఏ శిశువునైనా గర్బధారణ వయసుతో సంబంధం లేకుండా మాక్రోసోమిక్ బేబిగా పరిగణిస్తారు. మహిళల్లో గర్భవతిగా ఉన్నప్పుడు వచ్చే అత్యధిక బ్లడ్ షుగర్ వల్ల కడుపులో బిడ్డ 15 నుంచి 45 శాతం వరకు అధికంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది.