NTV Telugu Site icon

Earthquake: ఫిలిప్పీన్స్ లో భూకంపం..

Earthquicket

Earthquicket

ఫిలిప్పీన్స్ లో ఇవాళ 6.5 తీవ్రతతో భూకంపం సంభవించిందనీ, ప్రకంపనల కార‌ణంగా నష్టం వాటిల్లే ఛాన్స్ ఉందని స్థానిక అధికారులు హెచ్చరించారు. రాజధాని మనీలాకు 120 కిలో మీట‌ర్ల దూరంలో, 10 కిలో మీట‌ర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృత‌మై ఉంద‌న్నారు. మనీలాతో సహా దేశంలోని అత్యధిక జనాభా కలిగిన ప్రాంతంలో భూప్రకంపనలు సంభవించిన తర్వాత ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన‌ట్టు స్థానిక అధికారులు తెలిపారు. ప్రస్తుతం సంభ‌వించిన భూకంప ప్రభావం చాలా అధికంగానే ఉందనీ.. ప్రకంపనల సమయంలో ఇళ్ల నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు.

Also Read : Marri Janardhan Reddy: 150 కోట్లు ట్యాక్స్ కట్టాను.. పూర్తి వివరాలతో మీడియా ముందుకు వస్తా

భూకంపం నేప‌థ్యంలో ప్రాణనష్టం గురించి తక్షణ స‌మాచార‌ నివేదికలు లేవు.. కానీ ప్రకంపనల ప్రభావాన్ని అంచనా వేయడానికి విపత్తు అధికారులను నియమించామని కలటగాన్ మున్సిపల్ అధికారి మెండోజా చెప్పారు. భూకంపం 30 సెకన్ల నుంచి నిమిషం వరకు కొనసాగిందని కలటగాన్ విపత్తు అధికారి రోనాల్డ్ టోర్రెస్ వెల్లడించారు. భూకంప ప్రభావాన్ని అధికారులు అంచనా వేస్తున్నారని సివిల్ డిఫెన్స్ కార్యాలయ సమాచార అధికారి డియాగో మరియానో పేర్కొన్నారు. ప్రస్తుతానికి పెద్దగా ప్రాణనష్టం, ఆస్తి న‌ష్టం జరగలేదు.. అక్కడక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మరియానో మీడియాకు తెలిపారు.

Also Read : TS DH: విఆర్ఎస్‌కు హెల్త్ డైరక్టర్‌ దరఖాస్తు.. క్లారిటీ ఇచ్చిన శ్రీనివాసరావు

అయితే.. ఫిలిప్పీన్స్ లో భూకంపాలు రోజువారీగా సంభవిస్తాయి. 2013 అక్టోబర్ లో సెంట్రల్ ఫిలిప్పీన్స్ లోని బోహోల్ ద్వీపంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించి కొండచరియలు విరిగిపడి 200 మందికి పైగా చనిపోయారు. అప్పుడు.. భూకంపం కారణంగా దాదాపు 400,000 మంది నిర్వాసితులయ్యారు అని స్థానిక అధికారులు చెప్పుకొచ్చారు.