School Shooting: సెర్బియాలోని ఓ స్కూల్‌లో విద్యార్థి జరిపిన కాల్పుల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 8 మంది విద్యార్థులు కాగా.. మరొకరు స్కూల్‌లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు మృతి చెందారు. అదే స్కూల్‌లో చదివే ఓ టీనేజీ బాలుడే ఈ దారుణానికి పాల్పడ్డాడు. సెంట్రల్ బెల్‌గ్రేడ్‌లోని వ్లాదిస్లావ్ స్కూల్‌లో చదువుతున్న 14 ఏళ్ల బాలుడే కాల్పులు జరిపినట్లు తెలిసింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం తన తండ్రి తుపాకీని తీసుకుని అతడు బడికి వచ్చాడు. తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 9 మంది చనిపోగా.. మరో ఆరుగురు విద్యార్థులు, ఒక టీచర్ గాయపడ్డారు.
నిందితుడు లోపలకు వచ్చి ముందుగా ఓ టీచర్‌పై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఆ తర్వాత భయంతో డెస్క్‌లో కింద దాక్కునన్న విద్యార్థులపై కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన వ్యక్తి.. ఇంతకుముందు బాగానే ఉండేవాడని, బాగా చదివేవాడని తన కూతురు చెప్పిందని ఓ విద్యార్థిని తల్లి చెప్పారు. ఉపాధ్యాయుడి ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు పోరాడుతున్నారని పాఠశాల ఉన్న సెంట్రల్ వ్రాకార్ జిల్లా మేయర్ మిలన్ నెడెల్జ్‌కోవిక్ తెలిపారు. ఎనిమిది మంది పిల్లలు, ఒక సెక్యూరిటీ గార్డు మరణించారని, ఉపాధ్యాయుడితో పాటు ఆరుగురు పిల్లలు ఆసుపత్రి పాలయ్యారని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటన పేర్కొంది.ఏడో తరగతి విద్యార్థిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. హెల్మెట్‌లు, బుల్లెట్‌ప్రూఫ్ దుస్తులు ధరించిన అధికారులు పాఠశాల చుట్టుపక్కల ప్రాంతాన్ని చుట్టుముట్టారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నామని, కాల్పుల వెనుక గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. బడిలో కాల్పుల ఘటన.. విద్యార్థుల తల్లిదండ్రుల్ని తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఈ దాడిలో పిల్లల్ని కోల్పోయిన వారు.. పెను విషాదంలో మునిగిపోయారు. చాలా కఠినమైన తుపాకీ చట్టాలు ఉన్న సెర్బియాలో సామూహిక కాల్పులు చాలా అరుదు. కానీ పశ్చిమ బాల్కన్‌లు 1990లలో యుద్ధాలు, అశాంతి తరువాత వందల వేల అక్రమ ఆయుధాలతో కొట్టుమిట్టాడుతున్నాయి.
Read Also: Doctors On Strike: నిరవధిక సమ్మెకు దిగిన ప్రభుత్వ వైద్యులు.. కారణమేంటంటే?
ఇదిలా ఉండగా.. అమెరికాలో ఐదుగురిని కాల్చి చంపి పరారైన వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఓ ఇంట్లో దాక్కున్న అతడ్ని పక్కా సమాచారంతో అరెస్టు చేశారు.ఫ్రాన్సిస్కో ఓరోపెజా(38) అనే వ్యక్తి టెక్సాస్ రాష్ట్రం క్లీవ్‌ల్యాండ్‌లో గత శుక్రవారం ఐదుగుర్ని కాల్చి చంపాడు. మృతులంతా ఫ్రాన్సిస్కో పొరుగు ఇంటి వారే. శుక్రవారం అర్ధరాత్రి ఫ్రాన్సిస్కో తుపాకీ పేల్చుతుండగా.. పక్కింటి వారు అభ్యంతరం తెలిపారు. తుపాకీ శబ్దం వల్ల తమ ఇంట్లోని చిన్నారి నిద్ర పోవడం లేదని, దయచేసి దూరంగా వెళ్లాలని కోరారు. అయితే.. తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన ఫ్రాన్సిస్కో ఐదుగుర్ని కాల్చి చంపాడు. అనంతరం పారిపోయాడు.