Massive Cloudburst: నేడు 79 స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశమంతా ఘనం జరుపుకుంటున్నారు. మరోవైపు జమ్మూకశ్మీర్‌లో మాత్రం క్లౌడ్ బస్టర్‌తో మృత్యోఘోస వినబడుతోంది. కిష్త్వార్‌లో ప్రకృతి విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. గురువారం మధ్యాహ్నం 12:25 గంటల ప్రాంతంలో చషోటి, పద్దర్ తషోటిలో అకస్మాత్తుగా మేఘాల విస్ఫోటనం(క్లౌడ్‌బరస్ట్) సంభవించింది. చీనాబ్ నది ఉప్పొంగింది. నది నీటి మట్టం క్షణాల్లో పెరిగి నీటి ప్రవాహానికి ఇళ్ళు, వాహనాలు, దేవాలయాలు, వంతెనలు కొట్టుకుపోయాయి. వందలాది మంది ప్రజల జీవితాలను తుడిచిపెట్టుకుపోయాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు 65 మంది మరణించినట్లు నిర్ధారించారు. 100 మందికి పైగా గాయపడినట్లు చెబుతున్నారు.
READ MORE: Zerodha Kite Backup: డియర్ ట్రేడర్స్.. జీరోధా కొత్త ఫీచర్.. ఇకపై వాట్సాప్‌లో కైట్ బ్యాకప్ సర్వీస్!
వందల సంఖ్యలో జనాలు తప్పిపోయినట్లు సమాచారం! శిథిలాలలో చిక్కుకున్న వారిని రక్షించడానికి పరిపాలన, సహాయ సంస్థలు పగలురాత్రి తేడా లేకుండా పనిచేస్తున్నాయి. సైన్యం, NDRF, SDRF, పోలీసు సిబ్బంది తాళ్లు, యంత్రాల సహాయంతో ప్రజలను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ అంశంపై బారాముల్లాలో మంత్రి జావేద్ దార్ విలేకరులతో మాట్లాడుతూ.. గల్లంతైన వారి సంఖ్య ఇంకా స్పష్టంగా తెలియలేదని అన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించడానికి సహాయక బృందాలు నిరంతరం ప్రయత్నిస్తున్నాయని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కిష్త్వార్‌ను సందర్శించనున్నారు. మరోవైపు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రితో ఫోన్‌లో మాట్లాడి సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
