డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) షార్ట్ నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా CEPTAM 11 నియామకాలను ప్రకటించింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 764 భర్తీ చేయనున్నారు. వీటిలో 561 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ B (STA B), 203 టెక్నీషియన్ A (టెక్ A) పోస్టులు భర్తీకానున్నాయి. అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు. రిజర్వ్డ్ కేటగిరీలకు చెందిన వారికి నిబంధనల ప్రకారం పూర్తి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. విద్యా అర్హతల వివరాలను వివరణాత్మక నోటిఫికేషన్ లో వెల్లడించనున్నారు.
Also Read:H-1B Visa: H-1Bలో సమ్‌థింగ్ రాంగ్ జరుగుతోంది.. మాజీ వీసా అధికారి సంచలన వ్యాఖ్యలు
దరఖాస్తు ఫీజు రూ.100 చెల్లించాలి. SC, ST, వికలాంగుల వర్గాలకు చెందిన అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు. అభ్యర్థులు ముందుగా టైర్-1 కంప్యూటర్ ఆధారిత పరీక్ష రాయాలి. ఈ పరీక్షలో అవసరమైన కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థులు టైర్-2 (స్కిల్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్) కి వెళతారు. అన్ని దశల ఫలితాల ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 9న ప్రారంభంకానుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
